Vishwak Sen: బెడ్ రూమ్ ఏం చేస్తుంటారు- మరో కాంట్రవర్సీలో విశ్వక్ సేన్

కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ గా ఉండే టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ లేటెస్ట్ గా మరో కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు. సాధారణంగా హీరో విశ్వక్ సేన్ ఆయన నటించే సినిమాలు పాపులర్ అవ్వడానికి కాంట్రవర్సీలను అడ్డం పెట్టుకుంటాడు. అయితే లేటెస్ట్ గా విశ్వక్ సేన్ యాంకరింగ్ చేస్తున్న షో ద్వారా కూడా కాంట్రవర్సీలకు తెర లేపుతున్నాడు.

విశ్వక్ సేన్ ఒక పక్క వరుస సినిమాలు చేస్తూనే మరో పక్క ఆహా ఓటిటి లో ఫ్యామిలీ ధమాకా పేరుతో ఒక షో కు యాంకరింగ్ చేస్తున్నాడు. ప్రతి శుక్ర వారం ఈ షో ఆహా లో ప్రసారం అవుతూ వస్తుంది. ఇక షో లో ప్రతి వారం వివిధ కుటుంబాలు పాల్గొంటుంటాయి. అప్పుడప్పుడు సెలెబ్రెటీలు కూడా ఈ షో లో ఒక్కో ఎపిసోడ్ చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ అసలు సమస్య ఈ షో ద్వారానే వస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ షో  ఫ్యామిలీ అనే పదానికి అర్థం మార్చేసేలాగా ఉందని ఈ షో పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెగిటివిటి వస్తోంది. ఈటీవీ లో ప్రసారమయ్యే క్యాష్ షో విధంగా ఉండే షో లో యాంకర్ విశ్వక్ సేన్ అడిగే ప్రశ్నలు చాలా వరకు అభ్యంతకరంగా ఉంటున్నాయి. చాలా సార్లు మితిమీరిపోయే విధంగా వల్గారిటీ ప్రమోట్ చేసేటట్టు విశ్వక్ ప్రశ్నలు అడుగుతున్నాడు. దాంతో ఈ షో ఫ్యామిలి తో చూడటానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది.

- Advertisement -

అయితే ఇందులో విశ్వక్ సేన్ తప్పేముంది అంటే.. ఖచ్చితంగా విశ్వక్ సేన్ తప్పే అని చెప్పాలి ఎందుకంటే ఈ షో స్టార్ట్ అయ్యేముందు ఫ్యామిలీ లతో దగ్గర అవ్వాలి, ప్రేక్షకుల ప్రేమ పొందాలి అంటూ మైక్ ముందు అవాకులు చవాకులు పేలాడు. కానీ తీరా చూస్తే తన సినిమాలలో ఉండే బూతు పురాణం లాగే షో లో కూడా అదే ఉంటూ వస్తుంది. ఇక ఇటీవల ఇటీవలనేటెలికాస్ట్ అయిన  ఒక ఎపిసోడ్ లో అయితే ఏకంగా బెడ్ రూమ్ చేసే పనులేంటి అని ప్రశ్న అడిగాడు విశ్వక్ సేన్. మరి ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఫ్యామిలీ షో అని వాగడంలో అర్ధమేంటో షో ను నిర్వహిస్తున్న వాళ్ళకే తెలియాలి. ఏది ఏమైనా ఈ షో వల్ల మరో కాంట్రవర్సీ ను తన ఖాతాలో వేసుకున్నాడు హీరో విశ్వక్ సేన్ .

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు