7g brindavan colony : రీ-రిలీజ్ లోను అదే ఊపు- దిమ్మ తిరిగే కలెక్షన్స్

7g brindavan colony

డైరెక్టర్ సుకుమార్ చెప్పినట్టు సినిమా తీసే వాడు పోతాడు.. చూసే వాడు పోతాడు.. కానీ సినిమా మాత్రం శాశ్వతం అని.. పరిశీలించి చూస్తే ఆయనచెప్పింది అక్షర సత్యం అనిపిస్తోంది. ఒక మంచి సినిమా ప్రేక్షకుల మదిలో ఎప్పటికి నిలిచిపోతుందనే విషయాన్నీ మరోసారి రుజువు చేసింది 7జి బృందావన కాలనీ సినిమా. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో 2004 లో వచ్చిన 7జి బృందావన కాలనీ సినిమా ఒరిజినల్ గా రిలీజైనప్పుడు ఎంత పెద్ద హిట్ అయిందో.. రీ-రిలీజ్ అయిన కూడా అదే రెస్పాన్స్ ను అందుకుంది.

ప్రొడ్యూసర్ ఏ యం రత్నం కొడుకు రవి కృష్ణ హీరోగా సోనియా అగర్వాల్ హీరోయిన్ గా నటించిన 7జి బృందావన కాలనీ సినిమా ప్రస్తుతం నడుస్తున్న రీరిలీజ్ ట్రెండ్ లో భాగంగా నిన్న రీ రిలీజ్ అయింది.ఇక ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ కాసేపటి క్రితమే బయటికి వచ్చాయి. 7జి బృందావన కాలనీ సినిమా కు వచ్చిన కలెక్షన్ ను చూస్తే .. నిజంగానే దిమ్మ తిరిగిందని చెప్పాలి. రవి కృష్ణ పెద్దగా పేరున్న నటుడు కాదు అలాగే ఫ్యాన్ బేస్ కూడా లేదు. కానీ రీరిలీజైన మొదటి రోజే ఈ సినిమా ఏకంగా 1.04 కోట్ల గ్రాస్ ను రాబట్టి, రెండోవ రోజు అదే ఊపును కంటిన్యూ చేస్తుంది.

ఒక పక్క యూట్యూబ్ ఈ సినిమా అవలెబుల్ గా ఉన్నప్పటికీ థియేటర్స్ లో అరుపులు కేకల మధ్య 7జి బృందావన కాలనీ సినిమాను యూత్ విపరితంగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచి సినిమాకు మరణం లేదు అని చెప్పడానికి 7జి బృందావన కాలనీ సినిమా ఒక కొత్త ఉదాహరణ అని చెప్పవచ్చు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు