Ravi krishna : 7జీ బృందావన్ కాలనీ సినిమాను మిస్ చేసుకున్న ఆ ఇద్దరు ?

Ravi krishna

టాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్ లవ్ స్టోరీస్ అని చెప్పుకోవడానికి కొన్ని సినిమాలు మాత్రమే ఉంటాయి. అందులో ఒకటి 7జీ బృందావన్ కాలనీ. రవి కృష్ణ మరియు సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల మనసులో నుంచి ఇప్పటికీ ఎప్పటికీ పోదు. అయితే ఈ సినిమా ఇటీవల రి రిలీజ్ అయిన సంగతి విధితమే. 2004లో వచ్చిన ఈ సినిమా మళ్లీ థియేటర్స్ రావడంతో అప్పుడు థియేటర్ ఎక్స్‌పీరియన్స్ మిస్ అయినవాళ్లు ఇప్పుడు ఎంజాయ్ చేశారు.

టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు పోవడంతో థియేటర్స్ ముందు సందడి వాతావరణం నెలకొంది. సినిమాలోని ఫేమస్ అయిన సాంగ్స్, డైలాగ్స్ వచ్చినప్పుడు ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అయితే వేరే లెవెల్ అంటూ మూవీ లవర్స్ చెబుతున్నారు. 19 సంవత్సరాల క్రితం ఈ సినిమాను చూసి ఎలా ఫీల్ అయ్యారో ఇప్పుడు రి రిలీజ్ టైంలో కూడా అలాగే ఫీల్ అయ్యారు.

అయితే ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా చేసిన రవి కృష్ణ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కెరీర్ లో గుర్తుండిపోయే ఫర్మామెన్స్ అని అప్పుడు గానీ, ఇప్పుడు గానీ క్రిటిక్స్ అంటున్నారు. అయితే ఈ రోల్ కి రవి కృష్ణ ఫస్ట్ ఆప్షన్ కాదట. ఈ స్టోరీని డైరెక్టర్ సెల్వ రాఘవన్ ముందుగా మాధవన్, సూర్య లాంటి స్టార్ హీరోలకు వినిపించారట. అయితే వాళ్లు రిజెక్ట్ చేయడంతో సిద్ధార్థ్ తో పాటు ఆ టైంలో యంగ్ హీరోలుగా ఉన్న మరి కొంత మందిని సంప్రదించారట. కానీ, ఫైనల్ గా కొత్త హీరో అయిన రవి కృష్ణ ఎంపిక చేశారట. అలా ఈ సినిమాతోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి, ఫస్ట్ హిట్ ను కొట్టాడు రవి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు