Vijay Thalapathy New Movie: లియో స్టోరీ లీక్… మాస్టర్ నుంచి మున్నా వరకు?

Vijay Thalapathy New Movie

దళపతి విజయ్ అప్ కమ్మింగ్ మూవీ లియో పై ఉన్న అంచనాలు ఇంతా అంత కాదు. సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచే బజ్ పెరుగుతూ వస్తోంది. లోకేష్ కనగరాజ్, విజయ్ దళపతి కాంబోలో ఇప్పటికే మాస్టర్ సినిమా వచ్చి కోలీవుడ్ కి ఓ బిగ్ హిట్ వచ్చింది. మళ్లీ రెండో సారి కాంబో సెట్ అవ్వడం, అది కూడా లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగం అంటూ న్యూస్ రావడంతో లియో మూవీ ఇండియాస్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ అయిపోయింది.

కాగా, ఈ మూవీ అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా స్టోరీకి సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. లియో మూవీ స్టోరీ కొంత వరకు తెలుగులో ప్రభాస్ హీరోగా వచ్చిన మున్నా సినిమాను పోలి ఉంటుందట. అలాగే లోకేష్, విజయ్ కాంబినేషన్ లో వచ్చిన మాస్టర్ మూవీకి కూడా చిన్న లింక్ కూడా ఉండబోతుందని తెలుస్తోంది.

మాస్టర్ సినిమాలో ఎండ్ నుంచి లియో మూవీ స్టార్ట్ అవుతుందట. హీరో సొంతంగా ఒక ఫ్యాక్టరీ పెట్టుకుని, ఉంటాడట. అయితే తర్వాత ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) కుమారుడే మన హీరో అని తెలుస్తుందట. అయితే హీరో తన తండ్రి నుంచి దూరం కావడం వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉంటుందని టాక్. ఆంటోనీ దాస్ వల్లే హీరో అమ్మ చనిపోతుందట. దీంతో విజయ్ కి సంజయ్ దత్ కి మధ్య ఒక వార్ నడుస్తుందట.

- Advertisement -

వీరి మధ్య హరల్డ్ దాస్ ( హీరోకి అన్నయ్య & ఆంటోనీ దాస్ కి పెద్ద కుమారుడు) తో కూడా విజయ్ కి ఫైట్ సీన్స్ ఉంటాయట. అయితే ఓ సందర్భంలో హీరో, హరల్డ్ దాస్ కలిసిపోయి… సంజయ్ దత్ పై పగ తీర్చుకుంటారని తెలుస్తుంది. ఈ స్టోరీకే లోకేష్ కనగరాజ్ స్టైల్ లో స్క్రీన్ ప్లే డిజైన్ చేశారని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇందులో నిజం ఎంత వరకు ఉందో తెలియదు కానీ, ఈ స్టోరీకి లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ కి కూడా లింక్ ఉంటుందని మాత్రం కోలీవుడ్ లో కాస్త గట్టిగానే టాక్ వస్తుంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు