Leo: ఆకట్టుకుంటున్న లియో లేటెస్ట్ పోస్టర్స్ ! లియో ఆడియో లాంచ్ ఎప్పుడంటే ?

Leo

లోకేష్ కనకరాజ్, దళపతి విజయ్ కాంబినేషన్ లో వస్తోన్న లియో సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది లియో. దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా లియో సినిమా రిలీజ్ అవడానికి సిద్ధమవుతోంది. ఇక సినిమా రిలీజ్ కూడా సమయం దగ్గర పడుతుండటంతో ఈ సినిమాకు సంబంధించి అన్ని బాషలలో ఒక్కొక్కటిగా పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.

మొన్న లియో సినిమాకు సంబంధించి తెలుగు పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్ , నిన్న సాయంత్రం కన్నడ పోస్టర్ ను రిలీజ్ చేసారు. అయితే ఈ పోస్టర్స్ ప్రేక్షకులను, విజయ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఈ పోస్టర్స్ లియో సినిమాపై అంచనాలు కూడా రోజూ రోజుకు మరింతగా పెంచుతున్నాయని చెప్పవచ్చు.

ఇక లేటెస్ట్ గా చూస్తే లియో సినిమా ఆడియో లాంచ్ కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ బజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే రిలీజైన లియో సినిమా మొదటి పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ను చెన్నైలోని నెహ్రు ఇండోర్ స్టేడియం స్టేడియం లో గ్రాండ్ గా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. అయితే ఈ ఆడియో లాంచ్ సెప్టెంబర్ 30 జరగవచ్చని కోలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు