Bigg Boss Telugu : బిగ్ బాస్ కు ఇరిటేషన్ తెప్పిస్తున్న పల్లవి ప్రశాంత్ ?

Bigg Boss Telugu

బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో రైతు బిడ్డ అని చెప్పుకుంటూ హౌస్ లోకి అడుగు పెట్టిన పల్లవి ప్రశాంత్ వైఖరి రోజు రోజుకు వింత వింతగా మారుతోంది. గత వారం హౌస్ మేట్స్ అందరు పల్లవి ప్రశాంత్ ను టార్గెట్ చేసారంటూ సానుభూతితో ప్రేక్షకులు ప్రశాంత్ కు ఓట్ వేశారు. కానీ ప్రశాంత్ గేమ్ పరంగా చూస్తే ప్రశాంత్ ఆడిందేమి లేదనేది అందరికి తెలిసిందే. ఇక ప్రశాంత్ నామినేషన్ లో ఉన్నప్పుడు  తోటి హౌస్ మేట్స్ తో ఒకలాగా ఉండటం.. హౌస్ లో ఉన్నపుడు మరోలాగా ప్రవర్తించడం ఎవరికీ నచ్చడం లేదు. ఇక ఏకంగా సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో నైతే ఏకంగా బిగ్ బాస్ కె ఇరిటేషన్ తెప్పించాడు పల్లవి ప్రశాంత్.

ఆదివారం వీకండ్ ఎపిసోడ్ ముగిసేసరికి రెండోవారం ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ గా నటి షకీలా హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఇక సోమవారం ఎప్పటిలాగే నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఈ ప్రక్రియలో భాగంగా ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్ళడానికి గౌతమ్ కృష్ణ, శుభశ్రీ, ప్రిన్స్ యావర్, దామిని, రతికా రోజ్, ప్రియాంక, అమర్ దీప్ లు నామినేట్ అయ్యారు. అయితే నిజానికి టేస్టీ తేజా కూడా ప్రశాంత్ చేత నామినేట్ అవ్వగా శివాజీ, సందీప్ లు తమ స్పెషల్ పవర్ ఉపయోగించి తేజా ను ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ చేసారు.

అయితే ఈ నామినేషన్ ప్రాసెస్ లో భాగంగా పల్లవి ప్రశాంత్ టేస్టీ తేజా ను నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్ అందరికి ఆశ్చర్యాన్ని గురిచేసింది. దాంతో బిగ్ బాస్ కూడా పల్లవి ప్రశాంత్ ను మందలించి సరైన కారణం చెప్పి నామినేట్ చేయమని చెప్పగా పల్లవి ప్రశాంత్ కు ఎం చెప్పాలో అర్థంకాకా తన నామినేషన్ సరైనదే అని ప్రూవ్ చేయడానికి చాలా రోజుల క్రితం జరిగిన పాత రీజన్ తో తేజాను నామినేట్ చేసాడు. ఇక తేజా ప్రశాంత్ ను నామినేట్ చేస్తూ కూడా బిగ్ బాస్ ప్రక్రియ ప్రశాంత్ కు అర్థం కావడం లేదని చెప్పాడు . కానీ ప్రశాంత్ ఆ పాయింట్ ను యాక్సెప్ట్ చేయకుండా అనవసరమైన డ్రామా చేసి అత్యంత కీలకమైన నామినేషన్ ప్రక్రియను వేస్ట్ చేసాడు. రోజు రోజుకు పల్లవి ప్రశాంత్ అసలు హౌస్ లోకి ఎందుకు వచ్చాడని విషయాన్ని మర్చిపోయి బిహేవ్ చేయడం ఎవరి అర్థం కాకుండా ఉంది. మాటా మాట్లాడితే తొడ కొట్టడం, మీసం తిప్పడం ప్రశాంత్ అవివేకత్వాన్ని తెలియజేస్తున్నాయి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు