Keerthy Suresh: ఆ ఇద్దరు హీరోల చేతిలో మోసపోయిన కీర్తి సురేష్

Keerthy Suresh

టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ ఇద్దరు హీరోల చేతిలో దారుణంగా మోసపోయింది. వరుస సినిమాలు చేస్తూ కెరీర్ కు ఏమాత్రం డోకా లేకుండ ఉన్న సమయంలో కీర్తి సురేష్ చేసిన తప్పుల వల్ల ప్రస్తుతం ఆమెకు టాలీవుడ్ లో ఆఫర్స్ కరువయ్యాయి. ఇంతకీ కీర్తి సురేష్ చేసిన ఆ తప్పు ఏంటి ? ఆమెను మోసం చేసిన ఆ ఇద్దరు హీరోలు ఎవరని అనుకుంటున్నారా ?

అయితే ఆ హీరోలు మరెవరో కాదు..ఒకరు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మరొక హీరో టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి. విషయమేంటంటే కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ్ సినిమాలలో బిజీ గా ఉన్న సమయంలోనే ఆమె సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన పెద్దన్న సినిమాలో ఆయనకు చెల్లెలిగా నటించింది. అయితే ఆమె నటించిన ఈ చెల్లెలి పాత్రకు సినిమాలో మంచి ప్రాధాన్యత ఉన్న కూడా కీర్తి కెరీర్ కు మాత్రం పెద్దన్నా ఏ విధంగానూ ఉపయోగపడలేదు. బాక్స్ ఆఫీస్ పరంగా హిట్ టాక్ తెచ్చుకున్న పెద్దన్నా సినిమా వల్ల కీర్తి సురేష్ కు కోలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా నటించే అవకాశాలు తగ్గిపోయాయి

ఇక లేటెస్ట్ గా ఆమె నటించిన భోళా శంకర్ సినిమాలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. నాని నటించిన దసరా సినిమాతో టాలీవుడ్ లో సక్సెస్ ట్రాక్ లో పడిన కీర్తి సురేష్ ను ఆ తరువాత రిలీజ్ అయిన భోళా శంకర్ భారీ ఫ్లాప్ ను అందించింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన భోళా శంకర్ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవి అన్నా చెల్లెలుగా నటించారు. ఖచ్చితంగా సినిమా హిట్టవుతుందన్న నమ్మకంతో కీర్తి సురేష్ ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా ఆమె గట్టిగానే పాల్గొంది.

- Advertisement -

కానీ మొదటి షో నుంచే సినిమాకు నెగిటివిటీ స్టార్ట్ అయ్యి, చివరికి భోళా శంకర్ చిరు కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీనిబట్టి చూస్తే కీర్తి సురేష్ కు చెల్లెలి పాత్రలు ఏమాత్రం అచ్చిరానట్టే తెలుస్తోంది. ఇద్దరు స్టార్డం ఉన్న సూపర్ స్టార్ల సినిమాలలో నటించిన కూడా ఆమె సక్సెస్ ను మాత్రం చూడలేకపోయింది. ఇలాగా కీర్తి తాను పెట్టుకున్న నమ్మకాలను ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి మోసం చేసారని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు