Keerthy Suresh: అనిరుధ్ తో కీర్తి సురేష్ పెళ్లి ?

Keerthy Suresh

హీరోల పెళ్లి వార్తల మీద వచ్చే పుకార్లు సోషల్ మీడియాలో హల్చల్ చేయడం సాధారణమే కానీ అందుకు బిన్నంగా ఈ మధ్య తరుచుగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో తరుచుగా వినిపిస్తు హల్చల్ చేస్తున్నాయి . నిన్న మొన్నటి వరకు ప్రముఖ సింగర్ జోనితా గాంధీ తో అనిరుధ్ ప్రేమలో ఉన్నాడని త్వరలోనే అనిరుధ్ , జోనితా గాంధీ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు రాగా లేటెస్ట్ మరో రూమర్ అనిరుధ్ పెళ్లి గురించి కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే,

ప్రముఖ నటి కీర్తి సురేష్ ను అనిరుధ్ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నడని ఒక వార్త కోలీవుడ్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దీనికి కారణం ఇటీవల కాలంలో ఈ ఇద్దరు క్లోజ్ గా ఉండటమే. తరుచుగా పలు పబ్లిక్ ప్లేసెస్ లో కలుస్తున్న కీర్తి సురేష్, అనిరుధ్ పిక్స్ దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుండటంతో వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారని కోలీవుడ్ ఇండస్ట్రీ కోడై కూస్తుంది. దానికి తోడు కీర్తి సురేష్ కూడా అనిరుధ్ సంగీత దర్శకత్వం వహించిన ఏ సినిమా రిలీజైన ఆ పాటలకు రీల్స్ చేస్తుండటంతో ఈ అనుమానాలు తార స్థాయికి చేరుకున్నాయి

ఇక అనిరుధ్ కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్ అక్కడ.. ఇక్కడ పాకి చివరికి కీర్తి సురేష్ ఫాదర్ కంట పడింది. దాంతో ఆయన ఈ రూమర్ పై రియాక్ట్ అయ్యారు. కీర్తి సురేష్ అనిరుధ్ ప్రేమించుకుంటున్నారనే విషయంలో ఏమాత్రం నిజం లేదని ఆయన తెలిపారు. ఇంతకు ముందు కీర్తి సురేష్ పెళ్లి పై పలు రూమర్స్ వచ్చాయని. వాటిలాగే ఇది కూడా ఒక రూమర్ మాత్రమే అని ఆయన ఈ వార్తను కొట్టిపారేశారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు