Allu Arjun: పుష్ప 2 లో ఆ తమిళ్ స్టార్ హీరో – ప్లానింగ్ గట్టిగానే ఉంది

Allu Arjun

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న మోస్ట్ యాన్టిస్పెటెడ్ సినిమా పుష్ప 2 రోజు రోజుకు మరింత అంచనాలను పెంచుతుంది. ఇటీవలనే పుష్ప 2 సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ ఫ్యాన్స్ లో ఆనందాన్ని నింపిన మూవీ టీం అంతలోనే మరో బిగ్ సర్ప్రైస్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తునట్టు సమాచారం అందుతోంది.

పుష్ప సినిమా మొదటి పార్ట్ 2022 డిసెంబర్ రిలీజై, ఇండియా వైడ్ పాపులర్ అవ్వడంతో పుష్ప సినిమా సెకండ్ పార్ట్ పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో డైరెక్టర్ సుకుమార్ ప్రేక్షకుల్లో పెరిగిన ఈ అంచనాలనన్ని మైండ్ లోకి పెట్టుకొని అన్ని భాషల ప్రేక్షకులను అలరించడానికి గాను పుష్ప సినిమాలో పలు ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా పలువురు హీరోలను, ఆర్టిస్ట్ లను తీసుకోనున్నారట. ఇక లేటెస్ట్ గా వస్తోన్న రూమర్స్ ప్రకారం చుస్తే తమిళ్ స్టార్ హీరో కార్తీ ని పుష్ప సినిమాలో ఒక ప్రధాన పాత్రలో నటించడానికి గాని మేకర్స్ చర్చలు జరుపుతున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే మలయాళం స్టార్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ పుష్ప నటిస్తుండటంతో తమిళ్ ఆడియన్స్ ను కూడా పుష్ప లో ఇంక్లూడ్ చేయడానికి గాను సుకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి ఇదే గనక నిజమైతే పుష్ప రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. మైత్రి మూవీ మేకర్స్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్ట్ 15 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు