Keerthy Suresh: ఇక్కడ బాగానే ఉందిగా… అవసరమా అక్కడికి..?

Keerthy Suresh

సౌత్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. మహానటి సినిమాతో ఏ హీరోయిన్ కి సాధ్యం కాని క్రేజ్ సాధించింది. కేవలం కమర్షియల్ సినిమా హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ఎంచుకుంటూ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది కీర్తి.
ఈ ఏడాది తెలుగులో నాని సరసన నటించిన దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కీర్తి ఇటీవల భోళాశంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటించింది. సినిమా డిజాస్టర్ అయినప్పటికీ కీర్తి పర్ఫామెన్స్ కి మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం పలు తమిళ సినిమాలను లైనప్ లో పెట్టిన కీర్తి బాలీవుడ్ కి మకాం మార్చనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
వరుణ్ ధావన్ సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం అందుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోలంతా ప్రస్తుతం పాన్ ఇండియా హిట్స్ కోసం సౌత్ మీద డిపెండ్ అవుతున్న నేపథ్యంలో వరుణ్ ధావన్ కూడా పాన్ ఇండియా సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడట. వరుణ్ ధావన్, సమంతతో కలిసి నటించిన సిటాడెల్ సిరీస్ కి కూడా సౌత్ లో మంచి బజ్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.
అయితే, సౌత్ నుండి బాలీవుడ్ కి షిఫ్ట్ అయిన హీరోయిన్స్ లో ఒక్కరికి కూడా సరైన ఆఫర్లు లేని నేపథ్యంలో కీర్తి సురేష్ కి బాలీవుడ్ ఎంట్రీ కలిసొస్తుందా లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి. మరి, సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న టైమ్ లో రిస్క్ చేస్తున్న కీర్తికి బాలీవుడ్ ఎంట్రీ కలిసొస్తుందా లేక అందరు హీరోయిన్ల లాగే బ్యాడ్ టైమ్ స్టార్ట్ అవుతుందా అనేది వేచి చూడాలి.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు