Keerthy Suresh: చాలా రోజుల తరువాత విజృంభించిన కీర్తి…!

“కీర్తి సురేష్” ఈ పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకు మహానటి సావిత్రి గుర్తొస్తుంది అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. కెరీర్ ఆరంభం నుండి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ, అవకాశం వచ్చినప్పుడల్లా తన అభినయంతో ఆకట్టుకుంటూ వచ్చింది కీర్తి. ఇక మహానటి సినిమాలో తన కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అయితే మహానటి తరువాత సర్కారు వారి పాట సినిమా కంటే ముందు వరకు కీర్తికి చెప్పుకోదగ్గ హిట్ ఒకటి కూడా లేదు. సర్కారు వారి పాట సినిమా కమర్షియల్ గా హిట్ అయినప్పటికీ అందులో కీర్తికి నటన పరంగా పెద్దగా స్కోప్ లేదు.

మహానటి తరువాత తన స్టోరీ సెలెక్షన్ లో లోపమో, ఆడియన్స్ లో పెరిగిన అంచనాల కారణంగానో కీర్తికి అంతటి అప్రిసియేషన్ రాలేదు. అయితే తాజాగా నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన దసరా సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని, నాని కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అంతే కాకుండా ఇందులో కీర్తి సురేష్ నటనకు సామాన్య ప్రేక్షకులు మొదలుకొని క్రిటిక్స్ నుండి ప్రశంసలు అందుతున్నాయి. దీంతో కీర్తి ఫ్యాన్స్ తమ ఫేవరేట్ హీరోయిన్ కి మళ్లీ మంచి రోజులొచ్చాయని ఆనంద పడుతున్నారు.

ఇక ఇప్పటి నుండి అయినా కీర్తి లేడీ ఓరియెంటెడ్ సినిమాల జోలికి పోకుండా దసరా తో వచ్చిన కమర్షియల్ సక్సెస్ ప్లస్ అప్రిసియేషన్ ని నిలబెట్టుకునేలా తన స్టోరీ సెలక్షన్ లో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. నిజానికి కీర్తి కెరీర్ తోలి నాళ్ళ నుండి కూడా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ గ్లామర్ షో కి దూరంగా ఉంటూ వస్తోంది. ఈ కారణంగా కీర్తికి ఆడియెన్స్ లో ఒక క్లీన్ ఇమేజ్ ఏర్పడింది, మహానటి సినిమాతో ఆ ఇమేజ్ కాస్తా తార స్థాయికి చేరింది. ఒకరకంగా మహానటి తరువాత వరస ఫ్లాప్స్ కి ఇది కూడా కారణమే అని చెప్పొచ్చు. దసరాలో తన నటనకు వచ్చిన అప్రిసియేషన్ ను కీర్తి ఎన్నాళ్ళు నిలబెట్టుకుంటుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు