Dasara: అదిరిపోయిన మూడో రోజు కలెక్షన్లు

నాని నటించిన దసరా సినిమా తన రికార్డుల పరంపరను కొనసాగిస్తోంది. మార్చి 30 న విడుదలైన దసరా రెండు రోజుల్లోనే 53 కోట్లు వసూలు చేయగా తాజాగా మూడు రోజులకు సంబంధించిన కలెక్షన్ల వివరాలు బయటికి వచ్చాయి. మూడో రోజు ఐపీఎల్ ఎఫెక్ట్ ఏమి పనిచేయలేదు. వీకెండ్ లో ఫ్యామిలీ ప్రేక్షకుల సపోర్ట్ తో మూడో రోజు రికార్డు వసూళ్లు అందుకుంది. ఏ.పి, తెలంగాణా ల్లో కలిపి మూడో రోజు దసరా సినిమా 6.73 కోట్లు వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా, 9.18 కోట్ల షేర్ వసూలు చేసింది.

ఇక ఈ సినిమా మూడు రోజుల్లోనే నైజాం, ఓవర్సీస్ ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. నైజాం లో 13.7 కోట్ల బిజినెస్ జరగ్గా 14. 37 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్ లో 6 కోట్ల టార్గెట్ ఉండగా 6.5 కోట్లు మూడు రోజుల్లోనే వసూలు చేసి బ్రేక్ ఈవెన్ సాధించింది. ఆంధ్ర ఏరియాల్లో మామూలు గా ఆడుతున్న ఈ సినిమా నైజాం లో మాత్రం ఇరగ్గొడుతుంది.

ఇక దసరా సినిమా మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 38 కోట్లకు పైగా షేర్ ని వసూలు చేయగా 71 కోట్లకి పైగా గ్రాస్ ని వసూలు చేసి 100 కోట్ల దిశగా దూసుకుపోతుంది. పాన్ ఇండియా సినిమా గా దసరా విడుదలవగా ఇతర భాషల కలెక్షన్లు అంతగా రాకున్నా కేవలం తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల తో ఈ రేంజ్ వసూళ్లు సాధిస్తుంది. 51 కోట్ల బిజినెస్ జరిగిన ఈ సినిమా కి మరో 13 కోట్లు వసూలు చేస్తే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఆదివారం సెలవు రోజు కావడం వల్ల ఈ టార్గెట్ ని 4 రోజుల్లోనే బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు