Nazriya Nazim: సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్ గా స్టార్ట్ చేస్తున్న నజ్రియా..!

Nazriya Nazim

తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా కూడా నజ్రియాకి టాలీవుడ్లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఈ మధ్య అంటే సుందరానికి సినిమా ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది మల్లు బ్యూటీ. 2014 వరకూ యాక్టివ్ గా ఉన్న నజ్రియా ఆ తర్వాత ఫాహద్ ఫాజిల్ తో పెళ్లి చేసుకొని సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.
రాజారాణి సినిమా ద్వారా తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైన నజ్రియాను అంటే సుందరానికి సినిమాలో కూడా ఆదరించారు. అయితే, ఆ సినిమా తర్వాత నజ్రీయాకి తెలుగులో అవకాశాలు రాలేదు. ఈ నేపథ్యంలో నజ్రియా తమిళ్ లో రీఎంట్రీ ఇవ్వనుందని సమాచారం అందుతోంది.
సుధ కొంగర, హీరో సూర్య కాంబినేషన్లో రానున్న సినిమాలో నజ్రియా హీరోయిన్ నటించనుందని సమాచారం. అయితే, ఈ సినిమాలో అదితి శంకర్ హీరోయిన్ అని టాక్ ఉన్న నేపథ్యంలో నజ్రియా సెకండ్ లీడ్ గా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ అంశంపై క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్సమెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.
సూర్య సినిమాలకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఈ సినిమా తెలుగులో కూడా సైమల్టేనియస్ గా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నజ్రియాకి మరో తెలుగు సినిమా దక్కినట్టే అని చెప్పాలి. నజ్రియా రీఎంట్రీ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ అప్పుడే సెకండ్ లీడ్ క్యారెక్టర్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం పట్ల ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు