Nazriya Nazim : ఎంత వరకు కలిసొచ్చింది?

నజ్రియా మలయాళంలో ఓ స్టార్ హీరోయిన్. మంచి మంచి కథలను ఎంపిక చేసుకుని తన క్యూట్ పెర్ఫార్మన్స్ తో యూత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఈ మలయాళ భామ ‘రాజా రాణి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షించింది. తమిళ, మలయాళ భాషల్లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న తరుణంలో నజ్రియాను టాలీవుడ్ కు తీసుకురావాలని మన దర్శక నిర్మాతలు ట్రై చేశారు. అయితే, ఈ భామ స్కిన్ షో చేసే పాత్రలు ఎక్కువగా చేయదు. పలు ఆఫర్లు వచ్చినా, తిరస్కరిస్తూ వచ్చింది. మొత్తానికి ‘అంటే సుందరానికీ’ కోసం నజ్రియాను ‘మైత్రి మూవీ మేకర్స్’ ఒప్పించి, టాలీవుడ్ కు పరిచయం చేసింది.

దర్శకుడు వివేక్ ఆత్రేయ చెప్పిన స్క్రిప్ట్ కూడా ఆమెకు బాగా నచ్చింది. లీల పాత్రలో ఆమె చాలా బాగా నటించింది. ఇంకా చెప్పాలంటే జీవించేసింది అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత నజ్రియా తెలుగులో కూడా బిజీ అయిపోతుంది అని అంతా అనుకున్నారు. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు పెద్దగా రాకపోవడంతో, నజ్రియాను పట్టించుకునే దర్శకనిర్మాతలే లేరు. అయితే, నజ్రియా భర్త ఫహాద్ ఫాజిల్ కు మాత్రం తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ‘పుష్ప ది రైజ్’ లో 20 నిమిషాలు మాత్రమే కనిపించినా, తన నటనతో అబ్బురపరిచారు. ‘విక్రమ్’ లోని అమర్ పాత్ర కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. టాలీవుడ్ లో ఫహాద్ కు మంచి ఆఫర్లు వస్తున్నాయి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు