Tollywood : ఈ వీకెండ్ కూడా నిరాశే ?

టాలీవుడ్ లో ప్రేక్షకులు థియేటర్స్ వచ్చేలా సినిమాలు రావడం లేదు. గత రెండు వారాల నుండి అయితే, పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ‘అంటే సుందరానికీ!’ ‘విరాటపర్వం’ లాంటి సినిమాలు పాజిటివ్ టాక్, రివ్యూ లు తెచ్చుకున్నా, ప్రేక్షకులు మాత్రం థియేటర్స్ రావడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఈ వీకెండ్ లో దాదాపు 10 సినిమాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. ‘సమ్మతమే’ ‘చోర్ బజార్’ ‘కొండా’ ‘7 డేస్ 6 నైట్స్’ ‘ఒక పథకం ప్రకారం’ ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ లతో పాటు మరి కొన్ని చిన్న చిన్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. కానీ వీటిలో కాస్తో కూస్తో క్రేజ్ ఉన్న సినిమాలు ‘సమ్మతమే’ ‘చోర్ బజార్’ మాత్రమే అని చెప్పొచ్చు.

ఈ రెండు సినిమాలకు కూడా భీభత్సమైన ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశం అయితే లేదు. పాజిటివ్ టాక్ వస్తే వీకెండ్ వరకు జనాలు థియేటర్లకు వస్తారు. ఆ తర్వాత సంగతి దేవుడెరుగు. పాజిటివ్ టాక్ కనుక లేకపోతే ఈ వీకెండ్ కూడా థియేటర్లలో టికెట్లు తెగవు. జూన్ నెల ట్రాక్ ప్రోగ్రెస్ ను కనుక మనం పరిశీలిస్తే ‘మేజర్’ ‘విక్రమ్’ సినిమాలకు మాత్రమే జనాలు కదిలి వచ్చారు. ఈ నెలకు బ్లాక్ బస్టర్లు అందించిన సినిమాలు అవే. ‘సమ్మతమే’ ‘చోర్ బజార్’ సినిమాలు పాజిటివ్ టాక్ సంపాదించుకున్నా, ఆ రెండు సినిమాల కలెక్షన్లను అయితే అధిగమించే అవకాశం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు