Nazriya: సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పిన హీరోయిన్ – కారణం ఏంటంటే..?

ప్రస్తుతం సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు సోషల్ మీడియా లేకుండా రోజు గడవని పరిస్థితి ఏర్పడింది. తమ అభిమానులతో టచ్ లో ఉండటం కోసం సెలబ్రిటీలు సోషల్ మీడియా మీద ఆధారపడుతున్నారు. అయితే దీని వినియోగం పెరిగిపోవటం వల్ల తమ ప్రైవసీకి భంగం కలుగుతుందని భావించి కొంత బ్రేక్ తీసుకుంటూ ఉంటారు. తాజాగా హీరోయిన్ నజ్రియా కూడా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించింది. కొంతకాలం పాటు సోషల్ మీడియాకు దూరం కాబోతున్నానని, తిరిగి కలుసుకుంటానని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నజ్రియా తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉండేది. అయితే, ఈ మధ్య సినిమాలు తగ్గించటంతో పాటు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం కూడా తగ్గించింది.

నజ్రియా సోషల్ మీడియాకు దూరం అవుతున్నట్లు ప్రకటించగానే ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుసగా సినిమాలు చేయాలంటూ కామెంట్ చేస్తున్నారు అభిమానులు. నజ్రియా ఇటీవల అంటే సుందరానికి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయినా నజ్రీయాకి మాత్రం మంచి ఫోకస్ దక్కిందని చెప్పాలి.

నజ్రియా సోషల్ మీడియాకి దూరం అవ్వటం వెనక కారణం ఏమయ్యుంటుందని తన అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. పెళ్ళైన తర్వాత సినిమాలకు దూరమైన నజ్రియా కొంత కాలం గ్యాప్ తర్వాత 2018లో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాకు దూరం అవ్వటంతో నజ్రియా ప్రెగ్నెంట్ అయ్యిందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి హాట్ టాపిక్ గా మారిన నజ్రియా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వెనక కారణం ఏంటనేది తెలియాలంటే వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు