NBK108: బాలయ్యకి అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ ఇస్తాడా..? 

అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న తర్వాత హీరో నందమూరి బాలకృష్ణ అటు ఓటీటీలో షోలతో, ఇటు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్లో నటిస్తున్న బాలయ్య ఆ తర్వాత బోయపాటి సినిమాలో నటించనున్నాడు. అనిల్ రావిపూడి, బాలయ్య సినిమాపై నందమూరి అభిమానులు ఎంతో ధీమాగా ఉన్నారు. అనిల్ రావిపూడి తనతో మొదటిసారి సినిమా చేసిన హీరోలందరికీ బ్లాక్ బస్టర్ ఇవ్వటమే ఇందుకు కారణం. అనిల్ రావిపూడితో కళ్యాణ్ రామ్ పటాస్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సుప్రీమ్, రవితేజ రాజా ది గ్రేట్, వరుణ్ తేజ్, వెంకటేష్ లకు ఎఫ్ 2, మహేష్ బాబుకు సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్స్ అందించాడు.

బాలయ్య సరసన కాజల్ అగర్వాల్, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా అనిల్ రావిపూడి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి బాలయ్యకి హ్యాట్రిక్ హిట్ అందుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రివీల్ అయిన బాలకృష్ణ లుక్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తుండటం మరో ఆసక్తికర అంశం. ఈ ఏడాది జూన్ 27న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. బాలకృష్ణ గత రెండు సినిమాలు అఖండ, వీర సింహారెడ్డి కి కూడా థమన్ మ్యూజిక్ అందించడటంతో ఈ కాంబినేషన్ కి కూడా ఈ సినిమా హ్యాట్రిక్ గా నిలువనుంది. వరుస హిట్స్ తో ఊపు మీదున్న బాలకృష్ణకు అనిల్ రావిపూడి ఫస్ట్ సెంటిమెంట్ గనక కలిసొస్తే తమ హీరోకి మరొక బ్లాక్ బస్టర్ పక్కా అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి, ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు