Raviteja: రవితేజ నుండి కామెడీ సినిమా – హిట్ దక్కేనా..?

మాస్ మహారాజ రవితేజ అనగానే ఇంటిల్లిపాది కూర్చొని చూసి ఎంజాయ్ చేయగలిగే కమర్షియల్ ఎంటర్టైనర్స్ గుర్తొస్తాయి. అలాంటి రవితేజ ఇటీవల నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ లో రావణాసుర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చి డిజాస్టర్ మూట కట్టుకున్నాడు. ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి వరుస హిట్స్ తో ఊపు మీదున్న రవితేజ స్పీడ్ కి రావణాసుర సినిమా బ్రేకులేసింది. దీంతో రవితేజ తర్వాత సినిమా ఈ జానర్లో ఉండబోతోంది అన్న ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ తో రవితేజ ఓ కామెడీ సినిమా చేయనున్నాడని వార్తలొస్తున్నాయి. ఇటీవలే అనుదీప్ రవితేజకి కథ వినిపించగా అందుకు మాస్ మహారాజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, ఈ కాంబినేషన్ ఫై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం అందుతోంది.

దిల్ రాజు నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా తమన్నా, త్రిషల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరావు, ఈగల్ సినిమాలను లైన్లో పెట్టిన రవితేజ ఆ సినిమాల షూటింగ్ అయిపోగానే అనుదీప్ తో సినిమాను మొదలు పెట్టే యోచనలో ఉన్నాడట. రవితేజ నుండి ఫుల్ లెన్త్ కామెడీ సినిమా వచ్చి చాలాకాలం అవుతున్న నేపథ్యంలో అభిమానులు ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

జాతిరత్నాలు సినిమా ద్వారా తనదయిన ముద్ర వేసిన అనుదీప్ ప్రిన్స్ సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఈ క్రమంలో రవితేజ ఎనర్జీకి అనుదీప్ కామెడీ టైమింగ్ తోడైతే బ్లాక్ బస్టర్ సినిమా పడటం ఖాయం అని అంటున్నారు. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సిన ఈ కంబింబేషన్ వర్కౌట్ అవుతుందా లేదా?, రవితేజ నుండి అందరు ఆశిస్తున్న ఫుల్ లెన్త్ కామెడీ సినిమా వస్తుందా లేదా వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు