Niharika: మొత్తానికి క్లారిటీ ఇచ్చిన మెగా డాటర్..!

మెగాడాటర్ నిహారిక కొణిదెల గత కొంత కాలంగా తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. నిహారిక, చైతన్యలు విడాకులు తీసుకోబోతున్నారు అన్న రూమర్స్ ఇందుకు కారణం. ఆ రూమర్స్ పై ఎలాంటి ప్రకటన చేయని నిహారిక తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఇటీవలే సొంత నిర్మాణ సంస్థ స్థాపించిన నిహారిక డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ ని కూడా నిర్మించింది. అవకాశం దొరికినప్పుడల్లా సినిమాల్లో నటిస్తూ తనలోని నటిని సంతృప్తి పరుచుకుంటున్న నిహారిక మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే ఛాన్స్ అందుకుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో పుష్ప సినిమాకి సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం నిహారికకు అవకాశం ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.

అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో గిరిజన అమ్మాయి పాత్ర కీలకంగా ఉంటుందని, ఆ పాత్ర కోసం మొదట్లో సాయిపల్లవిని సంప్రదించగా వర్కౌట్ అవ్వకపోవటంతో ఇప్పుడు నిహారికకు ఎంచుకున్నారని అంటున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది సినిమా యూనిట్. ప్రస్తుతం డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న నిహారిక పుష్ప2 సినిమాలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చారు.

పుష్ప 2లో నిహారిక క్యారెక్టర్ పై యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందించిన నిహారిక, ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. దీంతో పుష్ప2 లో మెగా డాటర్ క్యారెక్టర్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న మెగా ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింది. అంతే కాకుండా తనపై వస్తున్న రూమర్స్ పై కూడా స్పందించిన నిహారిక, రూమర్స్ వల్ల మొదట్లో బాధ పడ్డానని, ఇప్పుడు వాటిని పటించుకోవడం మానేసానని చెప్పుకొచ్చింది. నటనపై మక్కువతోనే సినిమాల్లోకి వచ్చానని, సినిమాల్లో ఛాన్సులు వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పుకొచ్చింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు