Bollywood Actress: ఎంపీతో జరిగిన పరిణితి చోప్రా నిశితార్థం

బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కనుంది. మాములుగా బాలీవుడ్ లో ఏ హీరోయిన్ అయినా సినిమా ఆఫర్లు తగ్గాక, లేదా తమ స్టార్ హీరోయిన్ హోదా తగ్గాక పెళ్లి చేసుకోవడం కామన్. కానీ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే ఇప్పటికి పలు సినిమాలు లైన్లో పెట్టి పరిణితి చోప్రా వివాహం చేసుకోవడానికి సిద్ధం అయింది. తాజాగా మే 13న రాత్రి పరిణితి చోప్రా ఎంగేజ్మెంట్ న్యూ ఢిల్లీలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ విల్లా లో జరిగింది. ఆమ్ఆద్మీ పార్టీ ఎంపీ అయిన రాఘవ్ చద్దాతో పరిణితి చోప్రా ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది.

అయితే పరిణితి చోప్రా రాఘవ్ చద్దా మధ్య చాలా రోజులుగా ప్రేమాయణం నడుస్తుంది. లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎకాన‌మిక్స్‌లో రాఘ‌వ్ చ‌ద్దా, ప‌రిణీతి చోప్రా క‌లిసి చ‌దువుకున్నారు. కామ‌న్ స్నేహితుల ద్వారా ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం మ‌రింత పెరిగింద‌ని, అది కాస్త ప్రేమ‌గా మారిందని వారి సన్నిహితులు చెప్పారు. ఇక వీరిద్దరూ చాలా రోజులుగా రిలేషన్ షిప్ లో ఉన్నప్పటికీ మార్చిలో ఒక హోటల్ లో డిన్నర్ డేట్ కి రావడం వల్ల ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.తాజాగా నిన్న జరిగిన నిశితార్థంతో సోషల్ మీడియాలో చెత్త రూమర్స్ అన్నిటికి చెక్ పెట్టారు.

ఇక పరిణీతిచోప్రా రాఘవ్ చద్దా నిశితార్ధ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. పరిణితి చోప్రా కజిన్ అయిన బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక పరిణితి చోప్రా, రాఘవ్ చద్దాల వివాహం మాత్రం అక్టోబర్ లో జరుగనుంది అని వారి సన్నిహితుల నుంచి సమాచారం వచ్చింది. ఈ లోపు పరిణితి చోప్రా పెండింగ్ లో ఉన్న తన సినిమాలను కంప్లీట్ చేయాలనీ ప్లాన్ చేసుకుంటుంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు