Farhana : హీరోలని ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడగరు మీరు ?

ఐశ్వర్య రాజేష్ పేరుకి తెలుగమ్మాయైన తెలుగులో మాత్రం అవకాశాలు లేని అమ్మాయి. తమిళ్ లో పెద్ద సినిమాలు, మంచి క్యారెక్టర్స్ చేస్తూ బిజీ గా ఉండే ఈ తెలుగమ్మాయికి టాలీవుడ్ లో మాత్రం అవకాశాలు రావడం లేదు.

భీమనేని శ్రీనివాస రావు దర్శకత్వంలో వచ్చిన కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య. చేసిన మొదటి సినిమానే ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా అవడంతో ఈ అమ్మాయికి కమర్షియల్ సినిమాలలో అవకాశాలు రాలేదు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో విజయ్ కి జోడిగా నటించిన ఐశ్వర్యకి ఈ సినిమా ఎంత మాత్రం ఉపయోగపడలేదనే చెప్పాలి. క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. సినిమా కాస్తో కూస్తో ఆడితేనే హీరోయిన్స్ ని సరిగా పట్టించుకోని ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఇక ప్లాప్ అయితే అంతే సంగతి.

అయితే ఐశ్వర్య రాజేష్ మంచి యాక్ట్రెస్ అయినప్పటికీ ఫీమేల్ ఓరియెంటెడ్, ఎక్స్ పెరిమెంటల్ సినిమాలు ఎక్కువగ చేయడం వల్ల కమర్షియల్ సినిమాలలో అవకాశాలు రావట్లేదనేది కాదనలేని వాస్తవం. అయితే ఐశ్వర్య ఒక్కదానికే కాదు దాదాపు ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ అందరి పరిస్థితి ఇలాగే ఉంటుంది. తెలుగులో స్టార్ హీరోయిన్స్ గా చెలామణి అయిన అనుష్క, కాజల్ లాంటి హీరోయిన్స్ కూడా ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం వల్లనే కమర్షియల్ సినిమాలకి దూరమయ్యారు.

- Advertisement -

అయితే లేటెస్ట్ గా ఐశ్వర్య రాజేష్ ఫర్హానా అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా ఈ నెల 12న థియేటర్స్ లో విడుదలైంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఐశ్వర్య చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “ఎందుకు మీరు ఎక్కువ ఫీమేల్ ఓరియేంటేడ్ సినిమాలలోనే నటిస్తున్నారు” అని మీడియా వ్యక్తి అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఐశ్వర్య రాజేష్ “ఇదే ప్రశ్న మీరు హీరోలని ఎందుకు అడగరు” అని ఘాటుగా సమాధానం చెప్పింది. అలాగే ఈ విషయంపై ఆమె క్లారిటీ ఇస్తూ నాక్కూడా కమర్షియల్ సినిమాలు చేయాలనుందని కానీ అవకాశాలు రావట్లేదని, వస్తే తప్పకుండ చేస్తానని కోవిడ్ కి ముందు తాను సైన్ చేసిన సబ్జెక్ట్ లన్ని ఎక్కువగా విమెన్ ఓరియెంటెడ్ అవడం, అవి ఈ మధ్యనే కంటిన్యూగా రిలీజ్ అవడం వల్ల అలా అనిపిస్తోందని ఆమె చెప్పుకొచ్చింది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు