Ileana : బేబీ బంప్ తో గోవా బ్యూటీ

ప్రముఖ హీరోయిన్ గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో దేవదాస్ చిత్రం ద్వారా అడుగుపెట్టి మొదటి సినిమాతోనే మంచి పాపులారిటీ దక్కించుకున్న తర్వాత అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. స్టార్ హీరోయిన్గా పేరు ప్రఖ్యాతలు గడించిన ఇలియానా తన అందంతో వొంపు సోంపులతో యువతను విపరీతంగా ఆకట్టుకుందనే చెప్పాలి.

ఇక తను నటనతో, ప్రతిభతో యువతను ఆకట్టుకున్న ఈమె సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఇకపోతే తెలుగులో అవకాశాలు తగ్గిన సమయంలో బాలీవుడ్ కి మకాం మార్చిన ఈమె అక్కడ కొన్ని సినిమాలలో చేసింది. కాగా, ఇటీవల తాను ప్రెగ్నెంట్ అంటూ ఓ పోస్ట్ తో షాక్ ఇచ్చింది. అంతేకాకుండా బేబీ బంప్ వీడియోను షేర్ చేసింది. అయినా అభిమానులు ఏదో సినిమా ప్రమోషన్స్ అనుకున్నారు. తాజాగా బేబీ బంప్ బయటకు కనిపించేలా ఉన్న ఫోటోలను షేర్ చేసింది. బ్లాక్ స్కిన్ టైట్ డ్రెస్ లో చేతిలో డ్రింక్ గ్లాస్ పట్టుకొని నిల్చోని నవ్వుతున్న ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టింది. అంతేకాకుండా ‘బంప్ అలర్ట్’ అనే క్యాప్షన్ ఇచ్చింది. దీంతో అది చూసిన నెటిజన్లు పెళ్లి కాలేదు… మరి బిడ్డకు తండ్రి ఎవరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

For More Updates :

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు