Mega Fans: హద్దు దాటిన సునిశిత్.. బుద్ధి చెప్పిన చరణ్ ఫ్యాన్స్

ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఇష్టమోచినట్టు వాగితే కాలమే తగిన సమాధానం చెప్తుందంటారు. తాజాగా ఓ సంఘటన అలాగే జరిగింది. కొంత కాలం కిందట సినీనటులను కించపరుస్తూ, వాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సాక్రిఫైస్ స్టార్ గా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వ్యక్తి “సునిశిత్”. ఆ మధ్య అల్లు అర్జున్ ని, ప్రభాస్ ని, ఎన్టీఆర్ ని ట్రోల్ చేసి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన సునిశిత్ ఈసారి మరింత రెచ్చిపోయాడు.

తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య అయిన ఉపాసనపై తప్పుడు వ్యాఖలు చేసి అభిమానుల ఆగ్రహానికి బలయ్యాడు సునిషిత్. కొన్ని రోజుల కిందట ఓ యూట్యూబ్ ఛానల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ పైన తన భార్య ఉపాసనపైన సునిశిత్ దారుణమైన తప్పుడు వ్యాఖ్యలు చేసాడు. రామ్ చరణ్ తన భార్య ఉపాసనని పడేయమన్నాడని, ఇంకా తనతో లాంగ్ డ్రైవ్ వెళ్లానని దుష్ప్రచారం చేసాడు. అంతే కాకుండా తాను చిరంజీవి అల్లుడు కావాల్సిన వాడినని అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

ఈ విషయంపై తీవ్రంగా ఆగ్రహించిన రామ్ చరణ్ అభిమానులు సునిశిత్ కామెంట్స్ కు తగిన రీతిలో అతనికి దేహశుద్ధి చేశారు. ఉపాసన గురించి తప్పుగా మాట్లాడిన అతని ఇంటికి వెళ్లి అభిమానులు చితకబాదిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ తర్వాత అదే వీడియోలో సునిశిత్ చేత క్షమాపణలు కూడా చెప్పించారు మెగా అభిమానులు. ఆ వీడియోలో సునిశిత్ మాట్లాడుతూ “రామ్ చరణ్ గారికి ఉపాసన వదినమ్మకి నా క్షమాపణలు చెప్పుకుంటున్నాను” తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఇకపై ఏ సెలెబ్రెటీలపై వాళ్ళ పర్సనల్ విషయాలపై తప్పుడు వ్యాఖ్యలు చేయను, నాకు బుద్ధి వచ్చింది అని చెప్పాడు.

- Advertisement -

గతంలో ఇదే విధంగా ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠిపై కూడా తప్పుడు వ్యాఖ్యలు చేసాడు. లావణ్య త్రిపాఠి తన ప్రేమికురాలని, తనకు లావణ్యకు వివాహం కూడా అయిందని అన్నాడు. ఈ విషయం పై లావణ్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ లకు పిర్యాదు చేసింది. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేశారు. అయినా కూడా సునిశిత్ లో ఏ మార్పు రాలేదు. ఇప్పుడు రామ్ చరణ్ అభిమానుల ద్వారా బుద్ధి వచ్చి ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు మరోసారి చేయడని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు