Sithara Entertainments : దుల్కర్ సల్మాన్ తో వెంకీ అట్లూరి !

ప్రస్తుతం అన్ని భాషల సినీ పరిశ్రమలలో క్రాస్ కోలాబిరేషన్స్ ట్రెండ్ నడుస్తుంది. అంటే వేరే ఇండస్ట్రీ ల హీరోలు, డైరెక్టర్ లు తమ సొంత ఇండస్ట్రీలలో కాకుండా, ఇతర ఇండస్ట్రీ వాళ్ళతో పని చేయడం. అయితే ఈ ట్రెండ్ నిన్న, మొన్నటిది కాదు..ఎప్పటినుంచో ఉంది. కాకపోతే ఈ మధ్య పాన్ ఇండియా కల్చర్ పెరిగిపోవుతుండటంతో ఈ క్రాస్ కోలాబిరేషన్స్ కి మంచి క్రేజ్ వచ్చింది. యంగ్ హీరోల నుంచి మొదలు పెడితే స్టార్ట్ డైరెక్టర్ల వరకు కూడా ఈ ట్రెండ్ లో భాగమవుతున్నారు.

నాగ చైతన్య హీరోగా వచ్చిన రీసెంట్ మూవీ కస్టడీ కూడా ఈ క్రాస్ కోలాబిరేషన్ లో భాగంగానే వచ్చింది. అయితే ఈ ట్రెండ్ లో వచ్చిన కొన్ని సినిమాలు హిట్టయితే మరికొన్ని ప్లాప్ అయ్యాయి, ఇంకొన్ని హిట్, ప్లాప్ కాకుండా యావరేజ్ గా నిలిచాయి. రీసెంట్ గా చూసుకుంటే జాతి రత్నాలు సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ అనుదీప్ కేవీ తమిళ్ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ సినిమా చేసాడు. మంచి అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా రెండు భాషల్లోనూ ఆశించినంత విజయం సాధించలేకపోయింది. అలాగే మరో యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి, తమిళ్ స్టార్ హీరో ధనుష్ తో సార్ మూవీ చేసి సూపర్ హిట్ అందుకున్నారు. తెలుగులో ఈ సినిమా దాదాపు 100కోట్ల వసూళ్ళని సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

అయితే లవ్ స్టోరీ, విదేశీయానం బ్యాక్డ్రాప్ కామన్ పాయింట్ గా పెట్టుకొని సినిమా తీసే వెంకీ అట్లూరి సార్ సినిమాతో కూడిన అందరి చేత ప్రశంశలు అందుకున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశి, త్రివిక్రమ్ శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మిచిన ఈ సినిమా ఈ సంవత్సరంలో వచ్చిన ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అయితే సార్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న వెంకీ అట్లూరి మరోసారి క్రాస్ కోలాబిరేషన్ కి రెడీ అయ్యాడు. మలయాళం స్టార్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ కి తో వెంకీ అట్లూరి నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశి ఈ సినిమాని నిర్మించబోతున్నాడు.ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ అక్టోబర్ నుంచి మొదలవబోతుంది. మహానటి, సీతారామం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన దుల్కర్. వెంకీ అట్లూరి సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులని అలరించడానికి రెడీ అవుతున్నాడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు