#KeralaBoycottLeo: విజయ్ ఫ్యాన్స్ ఓవరాక్షన్ – మోహన్ లాల్ ఫ్యాన్స్ స్ట్రాంగ్ రియాక్షన్..!

#KeralaBoycottLeo

ఒక్కోసారి ఫ్యాన్స్ చేసే అతి సినిమా మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ ఫ్యాన్స్ చేసిన అతి వల్ల లియో సినిమాకి కేరళలో కష్టాలు వచ్చి పడ్డాయి. మోహన్ లాల్ ఫ్యాన్స్ ” #KeralaBoycottLeo ” హ్యాష్ ట్యాగ్ ని ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు.

కేవలం మోహన్ లాల్ ఫ్యాన్స్ మాత్రమే ఎంటైర్ మల్లువుడ్ ఆడియెన్స్ అంతా ఈ క్యాంపెయిన్ కి సపోర్ట్ చేయటంతో ఈ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రేండింగ్ లో ఉంది. ఈ బాయ్ కాట్ ట్రెండ్ ఎక్కువగా బాలీవుడ్ సినిమాల విషయంలో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సౌత్ లో కూడా ఈ ట్రెండ్ స్టార్ట్ అవ్వటం ఆందోళనకి గురి చేస్తోంది.

లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో వస్తున్న లియో సినిమా మీద అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న సినిమా కావటంతో పాన్ ఇండియా వైడ్ ఈ సినిమా మీద ఆసక్తి నెలకొంది. విజయ్ గత సినిమాలు బీస్ట్, వారిసు ఆశించిన స్థాయిలో అలరించకపోవటంతో ఈ సినిమా హిట్ అవ్వటం కీలకంగా మారింది.

- Advertisement -

ట్విట్టర్లో మొదలైన ఈ బాయ్ కాట్ ట్రెండ్ సినిమా మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపుతుందో అన్న ఆందోళన విజయ్ ఫ్యాన్స్ లో మొదలైంది. అక్టోబర్ 19న రిలీజ్ కి ప్లాన్ చేసిన ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్ప్స్, పోస్టర్స్ ఇప్పటికే రిలీజయ్యి సినిమా మీద ఆసక్తిని పెంచాయి. మరి, ఫ్యాన్స్ సహా నార్మల్ ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ బాయ్ కాట్ ట్రెండ్ తట్టుకొని బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా అన్నది వేచి చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు