Manchu Manoj
మంచు ఫ్యామిలీలో ట్రోలింగ్ బారిన పడకుండా తనకంటూ ఒక సపరేట్ ఫాలోయింగ్ సాధించాడు మనోజ్. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మనోజ్ అహం బ్రహ్మాస్మి సినిమాతో రీఎంట్రీ ఇవ్వటానికి రెడీ అవుతున్నాడు. చాలా కాలం కిందట షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రావాల్సి ఉంది.
ఇటీవలే విడుదలైన ఈ సినిమా గ్లిమ్ప్స్ సినిమా మీద ఆసక్తి పెంచుతోంది. ఇదిలా ఉండగా మనోజ్ స్మాల్ స్క్రీన్ పై సందడి చేయటానికి రెడీ అవుతున్నాడు. ఈటీవీ విన్ ఒరిగినల్స్ కోసం ఓ షో హోస్ట్ చేయనున్నాడు మనోజ్.
తాజాగా విడుదలైన ఈ షో ప్రోమో ఆకట్టుకుంటోంది. మనోజ్ వాయిస్ ఓవర్ తో తన లైఫ్ లోని అప్స్ అండ్ డౌన్స్ గురించి మనోజ్ ఇచ్చిన నరేషన్ షో మీద ఇంట్రస్ట్ పెంచుతోంది. మనోజ్ కి ఉన్న స్పాంటేనిటీతో ఈ షోలో ఎంటర్టైన్మెంట్ కి కొదవ లేకుండా ఉంటుందని ఆడియెన్స్ భావిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ షో గురించి ఇతర డీటెయిల్స్ త్వరలోనే తెలియనున్నాయి.
ఇంత కాలం తన స్టామినాకి ట్యాలెంట్ కి తగ్గ కథలు ఎంచుకోవడంలో విఫలమై సరైన హిట్ అందుకోలేకపోయిన మనోజ్ రీఎంట్రీ ఇచ్చాక అయినా మంచి హిట్ అందుకొని స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరి, మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ లో అయినా తన ట్యాలెంట్ కి తగ్గ హిట్స్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.