Anasuya: కులం తెలియని వ్యక్తితో సహజీవనం చేసిన అనసూయ ?

Anasuya

టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో యాంకర్లకు కొదవలేదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్లుగా రాణిస్తున్నారు. అలాగే ఇక్కడి వారు కూడా దూసుకుపోతున్నారు. అయితే ఎంతమంది యాంకర్లు ఉన్నా యాంకర్ అనసూయ భరద్వాజ్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. జబర్దస్త్ షోలో యాంకర్ గా పనిచేసి రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు బాగా దగ్గరయిపోయింది యాంకర్ అనసూయ భరద్వాజ్.

అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభం నుంచి చిన్న చిన్న పాత్రలు చేస్తున్న యాంకర్ అనసూయ భరద్వాజ్ కు పుష్ప సినిమాతో మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా తర్వాతనే జబర్దస్త్ షోకు కూడా గుడ్ బై చెప్పేసింది యాంకర్ అనసూయ. ఇక ఇప్పుడు ఫుల్ టైం టాలీవుడ్ నటిగా కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యాంకర్ అనసూయ భరద్వాజ్… తన పెళ్లి పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

తన పెళ్లి 2010 సంవత్సరంలో జరిగిందని… అంతకంటే ముందు తన భర్త భరద్వాజ్ తో 8 సంవత్సరాల పాటు సహజీవనంలో ఉన్నట్లు తెలిపింది. అప్పుడు తన భర్త కులం గురించి తాను ఎప్పుడూ అడగలేదని వెల్లడించింది. కానీ మా ఇద్దరి కుటుంబాల ఇష్టం మేరకు లివింగ్ రిలేషన్షిప్ తర్వాత పెళ్లి చేసుకున్నామని చెప్పుకొచ్చింది యాంకర్ అనసూయ భరద్వాజ్. కాగా ప్రస్తుతం అనుష్కకు ఇద్దరు కొడుకులు ఉన్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు