Vishwak sen : నిబ్బా వేషాలు మానుకో ? ఎప్పడు విజయ్ దేవరకొండ పై ఏడువటమేనా..

Vishwak sen

అరే కుర్రోడు బాగా కష్టపడతాడు.. మంచి సినిమాలు తీస్తూ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో మంచి హీరోగా ఎదుగుతున్నాడని నాలుగు మంచి మాటలు విశ్వక్ సేన్ గురించి మాట్లాడటం స్టార్ట్ చేస్తే చాలు వెంటనే ఈయనకున్న నోరి దూలతో ఎదో ఒక పెంట పెట్టుకుంటుంటాడు హీరో విశ్వక్ సేన్ .

నిన్న మొన్నటివరకు అస్సలు సంబంధమే లేకుండా బేబీ సినిమా కాంట్రావర్సీ నెత్తిన పెట్టుకొని నాలుగు రోజుల పాటు సోషల్ మీడియాలో హల్చల్ చేసిన విశ్వక్ సేన్.. ఆ వివాదం సద్దుమణిగిందో లేదో ఇప్పుడు మరొక వివాదానికి తెర లేపాడు.. ఇటీవలనే ఒక సినిమా ఈవెంట్ కి గెస్ట్ గా హాజరైన విశ్వక్ సేన్ లేటెస్ట్ గా విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు.

సాధారణంగానే విజయ్ దేవరకొండ పై జలసిని పలు సందర్భాలలో వ్యక్తీకరించిన విశ్వక్ సేన్ మరోసారి విజయ్ దేవరకొండపై పలు వ్యాఖ్యలు చేసాడు. ఇటీవల కాలంలో మనమందరం చాలా మేధావులం అనుకోని భారీ బడ్జెట్ పెట్టి పెద్ద సినిమాలు తీస్తాం కానీ అవి ఫ్లాప్ అవుతాయి. అలాగే కొన్ని సార్లు చిన్న సినిమాగా మాములు బడ్జెట్ తో సినిమా తీసిన కూడా అది బ్లాక్ బస్టర్ అవుతుందంటూ చెబుతూ కాంతారా సినిమాను ఎక్సమ్పుల్ గా చెప్పాడు. అలాగే తన విషయంకు వచ్చేసరికి ఏ సినిమాకైనా తాను ఒకేలాగా కష్తపడతానని అంతేగాని ఒక సినిమాకి ఎక్కువగా కష్టపడ్డాం ఇది 100 కోట్లు , 200 కోట్లు కొడుతుందని స్టేట్మెంట్స్ ఇవ్వను అని చెప్పుకొచ్చాడు.

- Advertisement -

అయితే విశ్వక్ మాట్లాడిన ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. విశ్వక్ మాటలు ఇండైరెక్ట్ గా లైగర్ సినిమా ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలను ట్రోల్ చేసినట్టుగా ఉండటంతో విజయ్ ఫ్యాన్స్ విశ్వక్ సేన్ పై మండిపడుతున్నారు. ఎందుకు విజయ్ దేవరకొండ అంటే అంత ఏడుపు నీకు.. ఈ నిబ్బా వేషాలు ఇంకెప్పటికీ మనుకుంటావ్ అంటూ విశ్వక్ ను కామెంట్స్ చేస్తున్నారు. అయితే గతంలో విశ్వక్ సేన్ విజయ్ ను టార్గెట్ చేస్తూ చాలా సార్లు పలు కామెంట్స్ చేసాడు. కానీ విజయ్ ఇప్పటి వరకు విశ్వక్ వ్యాఖ్యలకు స్పందించలేదు. కానీ అయిన కూడా విశ్వక్ సేన్ పదే పదే విజయ్ దేవరకొండ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో అర్థం కావడం లేదు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు