Chiranjeevi: మరో సూపర్ హిట్ సినిమా రీమేక్ కు “నో” చెప్పిన మెగా స్టార్

Chiranjeevi

భోళా శంకర్ సినిమా రిజల్ట్ మెగా స్టార్ చిరంజీవిలో భారీ మార్పునే తెచ్చినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే ఇకపై చిరంజీవి రీమేక్ సినిమాలు చేయడానికి ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదట. గతకొద్ది రోజుల క్రితం వరకు మెగా స్టార్ చిరంజీవి బ్రో డాడీ అనే రీమేక్ సినిమాలో నటిస్తున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నిజానికి ఆ వార్త రూమర్ కాదు వాస్తవమే.

భోళా శంకర్ సినిమా తరువాత చిరంజీవి బ్రో డాడీ రీమేక్ చేయడానికి దాదాపు అన్ని సన్నాహాలు జరిగాయి. ఇక సినిమా సెట్స్ పైకి వెళ్లడమే లేటు అనుకునే సమయంలో భోళా శంకర్ సినిమా రిలీజై, డిజాస్టర్ అవ్వడంతో చిరంజీవి ఇకనైన రీమేక్ సినిమాలు చేయడం మానెయ్యాలని మెగా అభిమానుల పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి. దాంతో బ్రో డాడీ సినిమా రీమేక్ అక్కడితో ఆగిపోయింది.

ఇక లేటెస్ట్ గా ఇటీవలనే చిరంజీవిని ఒక మలయాళ స్టార్ డైరెక్టర్ అమల్ భీష్మ పర్వం అనే సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి గాను ఆయనను సంప్రదించాడట.. కానీ చిరంజీవి ఇకపై రీమేక్ సినిమాలు చేయట్లేదని తెగేసి చెప్పేశాడట. అయితే చిరంజీవి తనతో సినిమా చేస్తాడని కొండంత ఆశతో ఆ డైరెక్టర్ నమ్మకంగా వచ్చినందుకు గాను చిరంజీవి ఆ డైరెక్టర్ తో వేరే కథ రెడీ చేసుకొని రమ్మని, తనకు ఒకవేళ ఆ కథ నచ్చితే తప్పకుండ సినిమా చేస్తానని ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చాడట. దాంతో ఆ డైరెక్టర్ వెనుదిరిగాడట.

- Advertisement -

భీష్మ పర్వం సినిమా మలయాళంలో చాలా పెద్ద హిట్ సినిమా. మమ్ముట్టి హీరోగా నటించిన ఈ సినిమా కేవలం 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 100 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయింది. కానీ మమ్ముట్టి ఇక్కడ పెద్దగా మార్కెట్ లేకపోవడం వల్ల ఇక్కడ ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ విషయమంతా పక్కన పెడితే చిరంజీవి తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఆనందాన్ని కలిస్తుందని చెప్పాలి. ఇక మెగా స్టార్ చిరంజీవి రాబోయే సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సుష్మిత కొణిదెల ప్రొడక్షన్ లో చిరంజీవి ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా డైరెక్టర్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే బింబిసార సినిమా ఫేం వశిష్ఠ తో చిరు మరో సినిమా చేయనున్నాడు. ఈ సినిమా నవంబర్ నుంచి మొదలవనుంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు