Prabhas: శివపార్వతులుగా ప్రభాస్, నయనతార ?

Prabhas

ఇటీవలనే ఆదిపురుష్ సినిమాలో శ్రీ రాముడిగా కనిపించి, ప్రేక్షకులను అలరించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి దేవుడి పాత్రలో కనిపించడానికి రెడీ అయ్యాడు. మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ గా రాబోతున్న కన్నప్ప సినిమాలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఏకంగా లయకారుడు శివుడు పాత్రలో కనిపించబోతున్నాడట.

వివరాల్లోకి వెళ్తే.. సీనియర్ హీరో మోహన్ బాబు మరియు మంచు విష్ణు ప్రధాన పాత్రలలో నటిస్తోన్న సినిమా భక్త కన్నప్ప సినిమా గురించి అందరికి తెలిసిందే.. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపించబోతున్నారట. అలాగే పార్వతి పాత్రలో కోలీవుడ్ లేడి సూపర్ స్టార్ నయనతార నటించబోతున్నట్టు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే గతంలో వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన యోగి సినిమాలో చివరిసారిగా ప్రభాస్, నయనతార లు జంటగా కనిపించారు. మళ్ళీ ఇన్నాళ్ల తరువాత వీరిద్దరి జోడి వెండి తెరపై కనిపించనుండంతో ఈ వార్త నెట్ లో ప్రస్తుతం ట్రేండింగ్ గా మారింది. ఇక ఈ కన్నప్ప సినిమాను హిందీలో మహాభారతం సిరీస్ ను డైరెక్ట్ చేసిన ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేయబోతున్నారు.

ఇటీవలనే కన్నప్ప సినిమా నుంచి హీరోయిన్ నుపుర్ సనన్ తప్పుకున్న విషయం తెలిసిందే. నుపుర్ సనన్ తరువాత ఈ సినిమాలో ఏ హీరోయిన్ నటించబోతున్నదనే విషయంపై కన్నప్ప మూవీ టీం ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కానీ ఈ సినిమా షూటింగ్ పనులు మాత్రం ఎక్కడ ఆగకుండా చక చక కానిచ్చేస్తున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు