Kannappa: మంచు విష్ణు కు జలక్ ఇచ్చిన నుపుర్ సనన్

Kannappa

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మంచు విష్ణు ప్రధాన పాత్రలలో నటిస్తోన్న సినిమా “కన్నప్ప”. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ అంటూ ఇటీవలనే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ కు ఆదిలోనే బ్రేక్ పడింది. ఇప్పటి వరకు మొదటి షెడ్యూల్ కూడా ఇంకా పూర్తి కాకుండానే కన్నప్ప టీం కు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నుపుర్ సనన్ జలక్ ఇచ్చింది.

ప్రస్తుతం నుపుర్ సనన్ తెలుగులో రవితేజ తో కలిసి టైగర్ నాగేశ్వర రావు సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే మొదటి పాన్ ఇండియన్ సినిమా కావడం విశేషం. అయితే ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగానేహీరోయిన్ నుపుర్ సనన్ కు మంచు విష్ణు కన్నప్ప సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. అయితే నటిగా కెరీర్ స్టార్ చేసిన ప్రారంభంలోనే నుపుర్ సనన్ రెండు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలలో నటిస్తుండటంతో అందరి దృష్ణిని ఆకర్షించింది.

అయితే అంత బాగుందనుకునే సమయంలో మరీ ఏమైంది ఏమో గాని కన్నప్ప సినిమా నుంచి నుపుర్ సనన్ తప్పుకుంది. షెడ్యూల్ కాంఫ్లిఫ్ట్స్ వల్ల నుపుర్ సనన్ కన్నప్ప సినిమా నుంచి తప్పుకున్నట్టు మంచు విష్ణు తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. దాంతో మంచు విష్ణు ట్విట్టర్ పోస్ట్ కింద నెటిజన్లంతా ఆమె తప్పుకోలేదు.. తప్పించుకుంది అని కామెంట్ చేస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు