Priyanka Chopra: ప్రియాంక చోప్రా ఆ ప్లేస్ లో సర్జరీ చేయించుకుందా..!

బాలీవుడ్ స్టార్ నటి, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకొని స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అగ్ర హీరోలు అందరి సరసన నటించి అన్ని భాషల్లోనూ అభిమానులను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ భామ హాలీవుడ్ స్టార్ సింగర్ ని వివాహం చేసుకుని ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయ్యింది. అయితే తాజాగా ప్రియాంకకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అదేంటంటే.. ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత తమ అందాన్ని మరింత మెరుగుపరచుకోవాలనుకుంటారు హీరో, హీరోయిన్లు. చాలామంది హీరోయిన్స్ ఎక్కువగా అందాన్ని మెరుగుపరుచుకోవడం కోసం ప్లాస్టిక్ సర్జరీలు వంటివి చేయించుకుంటూ ఉంటారు. అయితే అటువంటి సర్జరీలు కొన్ని సక్సెస్ అవుతూ ఉంటాయి.. మరికొన్ని వికటిస్తూ ఉంటాయి. చాలా కొన్నిసార్లు చాలామంది నటీనటులు సైతం ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి. బాలీవుడ్ నటి ప్రియాంక విషయంలో కూడా అదే జరిగింది.

ఈ విషయాన్ని గదర్ – 2 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న దర్శకుడు అనిల్ శర్మ చెప్పుకొచ్చారు. అనిల్ శర్మ మాట్లాడుతూ.. ప్రియాంక చోప్రా తో ది హీరో.. లవ్ స్టోరీ ఆఫ్ ఏ సైన్స్ అనే సినిమాని చేశారట. ఈ సినిమాకి ప్రియాంక సైన్ చేసిన తర్వాత అడ్వాన్స్ చెక్కు కూడా ఇచ్చినట్లు తెలిపారు. ఇక గదర్ సినిమా విడుదలైన తరువాత తాను అమెరికా, యూరప్ కి విహారయాత్రకు వెళ్లానని తెలిపారు. అలా రెండు నెలలకు తిరిగి వచ్చాక ప్రియాంక జూలియా రాబర్ట్ లా కనిపించాలని కోరుకున్నారట.

- Advertisement -

అదే సమయంలో ఆమె ముక్కు ఆపరేషన్ చేయించుకుందని పేపర్ లో చదివారట అనిల్ శర్మ. ప్రియాంక ఈ పని ఎందుకు చేసిందని చాలా ఆశ్చర్యపోయారట. వెంటనే ఆమెకు కబురు పెట్టగా.. మరుసటి రోజు తన తల్లితో కలిసి వచ్చిందట. నా సమయంలో వారిద్దరూ కన్నీళ్లు పెట్టుకుని ఆపరేషన్ గురించి తనకు తెలిపారని అన్నారు అనిల్ శర్మ. ఆ ఆపరేషన్ వల్ల ప్రియాంక సంతకం చేసిన అనేక ప్రాజెక్ట్స్ నుండి తొలగించబడిందని ఆమె తల్లి వాపోయిందట. ఆ ఆపరేషన్ నుండి ప్రియాంక కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టిందని ఆమె తల్లి చెప్పి బాధపడ్డారట.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు