Priyanka Chopra: ఆర్ఆర్ఆర్ ఒక తమిళ సినిమా..

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’. ఈ తెలుగు సినిమా పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్థాయి కి కూడా చేరుకుంది. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పురస్కారాలు అందుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు అనే పాటకు ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. దీంతో తెలుగు సినిమా ఘనత ఖండంతరాలు దాటింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో టాలీవుడ్ కు ప్రత్యేక స్థానం లభించింది. ప్రపంచ సినిమా తెలుగువైపునకు చూసింది.

టాలీవుడ్ కు ఇంతటి గుర్తింపు వచ్చినా, ఆర్ఆర్ఆర్ సినిమా అంటే బాలీవుడ్ సినిమా గానే చూస్తున్నారు. ఇటీవల ఆస్కార్ ఈవెంట్ లో కూడా ఆర్ఆర్ఆర్ బాలీవుడ్ అంటూ ఒక నటుడు కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా “డాక్స్ షెపర్డ్‌తో ఆర్మ్‌చైర్ ఎక్స్‌పర్ట్” అనే పోడ్‌కాస్ట్ కు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా గెస్ట్ గా వెళ్లింది. ఈ ఎపిసోడ్ లో యాంకర్ ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుతూ అది బాలీవుడ్ మూవీ అని అన్నాడు. దీని పై వెంటనే స్పందించిన ప్రియాంక చోప్రా.. ఆర్ఆర్ఆర్ బాలీవుడ్ మూవీ కాదు.. అది ఒక తమిళ మూవీ అంటూ యాంకర్ ను సరిచేసింది.

కానీ, ఆర్ఆర్ఆర్ బాలీవుడ్ కాదు.. కోలీవుడ్ కాదు. అది తెలుగు సినిమా అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోలేకపోయింది. దీనిపై నెట్టింట్లో తీవ్రమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఆస్కార్ గెలిచిన సినిమా ఏ భాష చిత్రమో తెలిదా ప్రియాంక అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

నిజానికి ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్ల కోసం ప్రియాంక చోప్రా తన వంతు ప్రయత్నం చేసింది. ఈ సినిమాను లాస్ అంజెల్స్ లో ఆర్ఆర్ఆర్ ప్రదర్శించిన సమయంలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసి, ఆర్ఆర్ఆర్ సినిమాకు నేను చేయగలిగిన చిన్న ప్రమోషన్ అని కాప్షన్ కూడా ఇచ్చింది. అంతేకాదు రామ్ చరణ్ తో కలిసి ప్రియాంక ఈ సినిమాను ఎంతగానో ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆస్కార్స్ ఈవెంట్ ముందు ఆర్.ఆర్.ఆర్ టీం కి ఓ పార్టీ కూడా ఇచ్చి అభినందనలు తెలిపింది.

అలాంటి హీరోయిన్ కు ఆర్ఆర్ఆర్ ఏ భాష చిత్రమో తెలిదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కనీసం ఒక ఇండియన్ ఫిలిం అని చెప్పి ఉన్నా ఓ రకంగా ఉండేది. కానీ ప్రపంచవ్యప్తంగా తెలుగు సినిమా చరిత్ర చెరగని ముద్ర వేసుకున్న ఈ తరుణంలో ఈ సినిమా ని ఇలా అవమానించటం ప్రేక్షకులకు నచ్చలేదు. ఓ ఇండియన్ గా ఏదో చేసేయాలి అనుకోని, ఈ హీరోయిన్ ఇప్పుడు ట్రోల్ల్స్ కి బలైపోయింది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు