Ram Charan – Rajkumar Hirani: వినడానకి బాగానే ఉంది… కానీ, అయ్యే పనేనా?

కొంత మంది డైరెక్టర్ల నుంచి సినిమాలు వచ్చాయంటే… ఎంత పెద్ద హిట్.. ఎన్ని కోట్ల లాభాలు అనే లెక్కాలు మాత్రమే ఉంటాయి. వాళ్ల కెరీర్‌లో ఫ్లాప్ అనే మాటే ఉండదు. అలాంటి వాళ్లలో ఒకరైన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన 20 ఏళ్ల కెరీర్‌లో చేసింది కేవలం ఐదు సినిమాలే. ఇప్పుడు వస్తున్న డంకీ ఆరో మూవీ. ఒక్కో సినిమాకి కనీసం మూడు నుంచి ఐదేళ్ల గ్యాప్ ఉంటుంది.

ఆయనకు టైంతో సంబంధం లేదు. సరైన స్క్రిప్ట్ పడితే, సినిమా చేస్తాడు. హిట్ కొడుతాడు. ఆయన ఇప్పటి వరకు చేసిన ఐదు సినిమాలు మున్నా భాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నా భాయ్, త్రీ ఇడియట్స్, PK, సంజు సినిమాలు ఒక్కొక్కటి ఒక్కో అద్భుతం. ఒక్కో సినిమా ఒక రికార్డ్. ఇందులో త్రీ ఇడియట్స్, PK, సంజు క్రియేట్ చేసిన సంచలనాల గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు రాబోతున్న డంకీ మూవీ కూడా ఇప్పటి వరకు ఉన్న బజ్‌ను బట్టి చూస్తే ఏదో సంచలనమే క్రియట్ చేయబోతుందని అర్థమవుతుంది.

అయితే గురువారం ఉదయం నుంచి సోషల్ మీడియాతో పాటు అన్ని వెబ్ సైట్స్ లలో రాజ్ కుమార్ హిరానీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే… ఈ దిగ్గజ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్ పరమైన డిస్కషన్స్ కూడా అయిపోయాయని ఈ వార్తల సారాంశం. ఈ వార్తలు రావడానికి కారణం లేకపోలేదు.

- Advertisement -

రామ్ చరణ్ బుదవారం ముంబై వెళ్లాడు. అక్కడ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనిని కలిశాడు. అలాగే రాజ్ కుమార్ హిరానీని కూడా కలిశాడు. వాళ్లు కొంత సేపు మాట్లాడుకున్నారు కూడా. ఇది చాలదా గాసిప్ రాయుళ్లకు. అదే జరిగింది. నిజంగానే వీరి కాంబినేషన్‌లో మూవీ వస్తే ఒక ఇండియాలోనే కాదు.. గ్లోబల్ రేంజ్ వరకు వెళ్తుంది. కానీ, అది అయ్యే పనేనా?

రాజ్ కుమార్ హిరానీ ఒక సినిమా చేయడానికి కనీసం 3 నుంచి 5 ఏళ్ల టైం తీసుకుంటాడు. ఇప్పటికే 60 ఏళ్ల వయసు ఉన్న ఈ స్టార్ డైరెక్టర్, తన తర్వాత సినిమాకు మరింత టైం తీసుకోవచ్చు. అయినా రామ్ చరణ్ ఇంకా గేమ్ ఛేంజర్ పనిలోనే ఉన్నాడు. దీని తర్వాత బుచ్చిబాబుతో RC16 చేయాలి. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే అంతా రెడీ అయి ఉంది కాబట్టి… షూట్‌కి వెళ్లడానికి పెద్దగా టైం పట్టకపోవచ్చు.

దీని తర్వాత చరణ్… ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా, లోకేష్ కనగరాజ్‌తో మరో సినిమా చేయబోతున్నట్టు టాక్ ఉంది. ఇవి పూర్తి అయిన తర్వాత ఏమైన ఛాన్స్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ వర్షెన్‌లో చూసినా, రామ్ చరణ్ వర్షెన్‌లో చూసిన ఈ కాంబో రాదు అని స్పష్టంగా చెప్పొచ్చు.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు