Priyamani: ఎన్టీఆర్‌కి ప్రియమణికి కొత్త సంబంధం… పాపం ప్రియమణికే ఎందుకిలా?

Priyamani

ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్. ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇటీవల నేషనల్ అవార్డ్ రావడంతో తారక్ మరో మెట్టు ఎక్కెశాడని చెప్పొచ్చు. ఎన్టీఆర్ తన కెరీర్ లో చాలా మంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అందులో ప్రియమణితో ఉన్న అనుభందం చాలా ప్రత్యేకం. ప్రియమణి, తారక్ కలిసి చేసిన యమదొంగ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ సినిమా తర్వాత ప్రియమణి, తారక్ ఇతర ప్రయివేట్ పార్టీల్లో కలుసుకున్నారు. అలాగే కొన్ని కామెడీ షోలలో కూడా పాల్గొన్నారు. వీటితో వీరి మధ్య ఫ్రెండ్ షిప్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో తెలుస్తుంది. ఇదంత పక్కన పెడితే, ప్రస్తుతం తారక్, ప్రియమణి గురించి ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే..? ఎన్టీఆర్ నుంచి వస్తున్న దేవర సినిమాలో ప్రియమణిని తల్లి పాత్ర చేస్తుందట. ఈ చిత్రంలో తారక్ ద్వి పాత్రాభినయం చేస్తున్నారంటూ ఒక గాసిప్ ఉన్న సంగతి తెలిసిందే.

అందులో తండ్రి పాత్రకు భార్యగా చేస్తుందట. అంటే కొడుకుగా కనిపించే తారక్ కు ప్రియమణి తల్లిగా నటిస్తుంది అంటూ కొంత మంది న్యూస్ వైరల్ చేస్తున్నారు. దీనిలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అయితే దీనిపై తారక్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఇలాంటి రూమర్స్ ను క్రియేట్ చేయొద్దని అంటున్నారు.

- Advertisement -

అయితే ఇలాంటి రూమర్స్ ప్రియమణికి కొత్తేమీ కాదు… కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప2లో ప్రియమణి ఒక పాత్ర చేస్తుందని అది కూడా తల్లి పాత్ర లాంటిదే అంటూ రూమర్స్ వచ్చాయి. ఇలా బ్యాక్ టూ బ్యాక్ తల్లి పాత్ర అంటూ రూమర్స్ రావడంతో ప్రియమణికే ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ ఒక చర్చ కూడా నడుస్తుంది.

కాగా ప్రియమణి ఇటీవల ఫుల్ ఫాంలో ఉంది. ఇటీవల ప్రియమణి నటించిన జవాన్ 1000 కోట్ల మార్క్ ను అందుకుని బాక్సాఫీస్ వద్ద సునామి స్రుష్టిస్తోంది. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ లోనూ ప్రియమణి క్రేజ్ పెరిగిపోయింది. ఇలాంటి టైంలో తల్లి పాత్రలు అంటూ రూమర్స్ రావడం తన కెరీర్ కు కొంత వరకు మైనస్ అవుతుందని చెప్పొచ్చు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు