Priyamani : మరోసారి

టాలీవుడ్ నటి ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆమె ఎవరే అతగాడు సినిమాతో తెలుగు ప్రేక్షలకులను పలుకరించింది. ఇక ఆ తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన యమదొంగ సినిమాలో  జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అప్పటి నుంచి వరుస ఆఫర్లను సొంతం చేసుకొని తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంది. పెళ్లి తరువాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన ప్రియమణి తాజాగా మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. 

ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో నటించి అందరి  తనవైపునకు తిప్పుకుంది. ఆహా ఓటీటీ వేదికగా వచ్చిన భామ కలాపంతో భారీ విజయాన్నే అందుకుంది. తాజాగా ప్రియమణి DR56 అనే చిత్రంలో హీరోయిన్ ఓరియెంటేడ్ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం కన్నడంలో తెరకెక్కుతోంది. తెలుగుతో పాటు, తమిళం, మలయాళంలో కూడా ఒకేసారి విడుదల చేయనున్నారు. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమాలో ప్రియమణి ఫస్ట్ లుక్ ను కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి విడుదల చేశారు. 

ఇందులో ప్రియమణి బ్లాక్ అండ్ వైట్ సూట్ లో సీరియస్ లుక్ లో కనిపిస్తోంది. ఫస్ట్ లుక్ తో సినిమా పై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. భామ కలాపం తరువాత ప్రియమణి మరో హిట్ కొట్టడం పక్కా అన్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమా హిట్ అయితే మాత్రం ప్రియమణికి మరిన్నీ అవకాశాలు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రియమణి ఈ సినిమాతో పాటు సైనైడ్ అనే సినిమాలో కూడా నటిస్తోంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు