Tamannaah : ఎట్టకేలకు పెళ్లి టాపిక్ 

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి టాలీవుడ్ జనాలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు టాలీవుడ్ లో ఇప్పటికే తన మార్కును చూపెట్టింది. టాలీవుడ్ లో ఉన్న అందరూ స్టార్ హీరోలతో ఈ భామ ఇప్పటికే స్క్రీన్ షేర్ చేసుకుంది. సినిమాల్లో నటించడమే కాకుండా, ప్రత్యేక గీతాల్లో కూడా నటిస్తోంది. ఈ బ్యూటీ కి ఉన్న క్రేజ్ గురించి సెపరేట్ గా చెప్పాల్సిన పనిలేదు.

ఎంతో క్రేజ్ ను ఈ బ్యూటీ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఈ చిన్నది పోస్ట్ చేసే ఫోటోలు పలువురు కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా సోషల్ మీడియాలో హాట్, హాట్ ఫోటోలతో కుర్ర కారును రెచ్చగొడుతుంది. ఇక ఎఫ్ 3 సినిమాలో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇది ఇలా ఉండగా, తాజాగా తమన్నా కామెంట్స్ వింటే, త్వరలోనే తమన్నా పెళ్లి చేసుకోబోతుందని అర్థం అవుతుంది. 

ఇంతకీ తమన్నా ఏం కామెంట్స్ చేసిందో ఆమె మాటల్లోనే విందాం. తమన్నా పెళ్లి, పిల్లలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ, ‘నేను పెళ్లికి వ్యతిరేకిని కాదు. ఇన్నాళ్లు సినిమాల బిజీలో పడి నా పెళ్లి గురించి పెద్దగా ఆలోచించలేదు. అయితే, నేను త్వరలోనే పెళ్లి చేసుకుని పిల్లల్ని కణాలనుకుంటున్నాను’ అంటూ తమన్నా చెప్పుకొచ్చింది. ఎప్పుడూ పెళ్లి టాపిక్ గురించి ప్రస్తావించని తమన్నా  మొత్తానికి త్వరలో పెళ్లి చేసుకుని పిల్లల్ని కంట అంటూ తన ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. మరి పెళ్లి తర్వాత తమన్నా సినిమాలను కంటిన్యూ చేస్తుందో  లేదో  అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు