హీరోయిన్ కృతి సనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న కృతి సనన్ తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన “1 నేనొక్కడినే” సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.
ఇక ఆ తర్వాత నాగచైతన్య – సుధీర్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన “దోచేయ్” సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా వర్కౌట్ కాకపోవడంతో ఈమెకు తెలుగులో ఆఫర్లు రాలేదు. దాంతో వెంటనే ఈ అమ్మడు బాలీవుడ్ కి చెక్కేసి అక్కడ వరుస సినిమాలలో నటిస్తూ మంచి పేరుని సంపాదించుకుంది. ప్రభాస్ తో కలిసి ఆదిపురుష్ సినిమాలో కూడా నటిస్తోంది కృతిసనన్. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సామాజిక అంశాలపై మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి తరచూ సోషల్ మీడియాలో పోరాటం చేస్తూ ఉంటుంది.
Read More: Rajinikanth: ఒక్క పోస్టర్ తో అంచనాలు పెంచేసిన లాల్ సలాం
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి సనన్ మాట్లాడుతూ.. ” ఎప్పుడూ మనలోని లోపాలను వెతుక్కోకూడదు. ఎప్పుడో చేసిన తప్పుల్ని గుర్తు తెచ్చుకొని మరీ బాధపడుతుంటాం. అలాంటివి మర్చిపోవాలి. మనకంటూ ఓ గొప్పదనం, ప్రత్యేకత ఉంటాయి. వాటికి సంతోషించాలి. ఎప్పుడు సానుకూలంగా ఆలోచించాలి. మనకి మనం బాగాలేమని అనుకోవడం ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఇతరుల పట్ల ప్రేమగా ఉండడం అవసరమే కానీ.. అంతకంటే మనపై మనం ప్రేమగా ఉండాలి”. అని చెప్పుకొచ్చింది.
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...
నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ...