Priyamani: ఆ హీరోపై క్రష్ ఉంది.. ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Priyamani

నటి ప్రియమణి అంటే తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు. త్రిష, శ్రీయ లాంటి హీరోయిన్లతో సమానంగా టాలీవుడ్ ని ఏలిన హీరోయిన్ ప్రియమణి. తెలుగుతోపాటు తమిళ సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది ఈ తమిళ పొన్ను. నవవసంతం, యమదొంగ, గోలీమార్ వంటి సినిమాలతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు లేకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూ.. సినిమాల్లో బిజీగా ఉంటుంది.

పెళ్లి తర్వాత కొంతకాలం స్క్రీన్ కి దూరమైన ప్రియమణి.. తన సెకండ్ ఇన్నింగ్స్ ని పక్కా ప్లాన్ ప్రకారం స్టార్ట్ చేసి వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లు, టీవీ షో లతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ జవాన్ లో ఓ కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రియమణి ఓ మీడియా సంస్థతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

బాలీవుడ్ నటుల్లో ఎవరిపైనైనా క్రష్ ఉందా..? అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. “బాలీవుడ్ నటుల్లో ఎవరి స్టైల్ వారిదే. నాకు చాలామంది నటులు ఇష్టం. కొన్ని అభిమాన పాత్రలు కూడా ఉన్నాయి. అయితే నాకు క్రష్ ఉన్న ఏకైక వ్యక్తి షారుక్ ఖాన్. లక్కీగా షారుక్ తో వర్క్ చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయనతో మరిన్ని ప్రాజెక్టులు చేయాలని కోరికగా ఉంది” అని చెప్పుకొచ్చింది ప్రియమణి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు