Bigboss season7: ఇట్స్ అఫిషియల్… రతికా ఎలిమినేటెడ్… ఆడియన్స్ రివేంజా?

Bigboss season7:

టెలివిజన్ లో కొన్ని రోజుల క్రితమే బిగ్ బాస్ సీజన్ 7 సందడి మొదలైందని తెలిసిందే. అయితే గత సీజన్లో లాగా కాకుండా ఈ సీజన్లో అంతా ఉల్టా పల్టా గా సాగుతుందని నాగార్జున చెప్పడం జరిగింది. అలా అన్నట్టుగానే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎంట్రీ మొదలుకొని, ఇప్పటివరకు అన్నీ కొత్తగా జరుగుతూ వచ్చాయి. అయితే ఆటలో మాత్రం కొంచెం వెరైటీ గా ఇంతకు ముందు పెట్టే టాస్క్ ల కన్నా కొత్తగా జరుగుతున్నాయి.

ఇక అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ సీజన్ 7లో ఇప్పటివరకు ముగ్గురు ఎలిమినేట్ అవగా ఆ ముగ్గురూ ఫిమేల్సే అని తెలిసిందే. ఇక ఈ వారం మాత్రం టేస్టీ తేజ అవ్వొచ్చని ఆడియన్స్ ఊహించారు. కానీ అలా కాకుండా బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రతిక ని ఎలిమినేట్ చేయడం జరిగింది. అయితే ఈ ఎలిమినేషన్ కామన్ ఆడియన్స్ గెస్ చేయలేదు కానీ, బిగ్ బాస్ లవర్స్ మాత్రం చాలా మంది రతికయే ఎలిమినేట్ అవ్వాలని అనుకున్నారు.

ఎందుకంటే బిగ్ బాస్ లోకి వచ్చాక రతిక ఒక రకంగా తన గ్లామర్ షో తో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసిందే తప్ప, ఆటలో పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు. పైగా బిగ్ బాస్ లో చాలా మందితో గొడవ పెట్టుకుంది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ తో చీటికీ మాటికీ అనవసరంగా గొడవకి దిగేది. తనే గాక ప్రియాంక, శోభా శెట్టి, అమర్ దీప్, ఆఖరికి సీనియర్ కంటెస్టెంట్ శివాజీ తో కూడా రచ్చ చేసింది. అందుకే ఆడియన్స్ దృష్టి లో రతిక ఒక గేమ్ ప్లేయర్ గా కాక, ఒక ఫైర్ బ్రాండ్ అన్నట్టు ముద్ర పడింది.

- Advertisement -

పైగా పల్లవి ప్రశాంత్, ఇంకా అమర్ దీప్, ప్రియాంక ఫ్యాన్స్ తనకి అగైనిస్ట్ అయ్యారు. గత రెండు వారాలుగా సోషల్ మీడియా లో రతిక ఎలిమినేట్ అవ్వాలని ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యిందో తెలిసిందే. ఏది ఏమైనా ఒక రకంగా రతిక పై ఆడియన్స్ రివేంజ్ తీర్చుకున్నారని తెలుస్తుంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు