BigBoss Season7: బిగ్ బాస్ దృష్టిలో అతను.. ఆడియన్స్ దృష్టిలో ఆమె..?

BigBoss Season7:

స్టార్ మా బిగ్ బాస్ సీజన్ 7 లో మళ్ళీ వీకెండ్ వచ్చింది. వీకెండ్ వచ్చిందంటే నాగ్ సరదా కబుర్లతో పాటు వీకెండ్ ఎలిమినేషన్ కూడా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ షోలో ముగ్గురు ఎలిమినేట్ అవగా, ఇక నాలుగో ఎలిమినేషన్ కు టైం వచ్చేసింది. అయితే ఇంతకు ముందు ఎలిమినేట్ అయినా వాళ్లలో, ఇద్దరు ఎక్స్పెక్టడ్ గానే ఎలిమినేట్ కాగా, మరొకరు ఆడియన్స్ వోటింగ్స్ లెక్క ద్వారా ఎలిమినేట్ అవడం జరిగింది. పైగా ముగ్గురూ ఫీమెల్స్ కావడం గమనార్హం.

అయితే ఈ వారం ఎలిమినేషన్ మాత్రం చాలా ఆసక్తిగా మారనుంది. ఎందుకంటే అందులో ఉన్న వాళ్లందరికి బయట మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. కాబట్టి 4th కంటెస్టెంట్ ఎలిమినేషన్ టఫ్ గా ఉంది. అయితే ఈ వారం నామినేషన్ లో 7 మంది ఉన్నా ఎక్కువ దృష్టి మాత్రం ఓ ఇద్దరిపై బాగా ఉంది. అందులో ఒకరు “టేస్టీ తేజ”. తేజ బిగ్ బాస్ లోకి వచ్చినప్పటినుండి బాగా ఎంటర్టైన్ చేస్తున్నా, బాగా ఆడడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. పైగా లేటెస్ట్ గా జరిగిన స్మైలింగ్ టాస్క్ లో గౌతమ్ పీక పై బెల్ట్ వేసి ఒక్కసారిగా లాగాడు. అది చాలా దారుణం అనిపించింది. దాని వల్ల బిగ్ బాస్ ఇంకా కంటెస్టెంట్స్ దృష్టిలో తేజ బ్యాడ్ అయ్యాడు. అందుకని తేజ ని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.

అయితే వోట్ వేసే ఆడియన్స్ దృష్టిలో మాత్రం ఇంకో వ్యక్తి ఎలిమినేట్ కావాలని అనుకుంటున్నారు. వారే “రతిక”. బిగ్ బాస్ లో రతిక వచ్చే ముందు చాలా పాజిటివిటీ ఉన్నా, ఒక్కో వారానికి అది తగ్గుతూ వచ్చింది. హౌస్ మేట్స్ తో గొడవల వల్ల, ఇంకా అండర్ పెర్ఫార్మన్స్ వల్ల గాని, ముఖ్యంగా ప్రశాంత్ తో మాటిమాటికి ఒకే టాపిక్ తో గొడవలు పడడం వల్ల ఆడియన్స్ దృష్టిలో బ్యాడ్ అయ్యింది. అందుకే రతికని ఈ వీక్ లో ఎలిమినేట్ చెయ్యాలని సోషల్ మీడియా లో ట్రెండ్ చేస్తున్నారు. మరి ఈ వారం బిగ్ బాస్ నిర్ణయం ఏముంటుందన్నది ఆసక్తిగా మారింది. టేస్టీ తేజ ని ఎలిమినేట్ చేస్తాడా? లేక రతిక ని ఎలిమినేట్ చేస్తాడా? ఒకవేళ వీళ్ళిద్దరూ కాకుండా ఇంకెవరైనా ఎలిమినేట్ అవుతారా?

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు