Siddharth: చిట్టి కోసం ‘చిన్నా’ వస్తున్నాడు?

Siddharth:

టాలీవుడ్ లో మంచి లవర్ బాయ్ గా ఒకప్పుడు స్టార్ హీరో రేంజ్ ని అనుభవించిన నటుడు సిద్ధార్థ్. ఈ హీరో నటించిన బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఇంకా ఆట లాంటి సినిమాలు ఎవర్ గ్రీన్ సినిమాలు గా తెలుగు ఆడియన్స్ ని ఇప్పటికి అలరిస్తూనే ఉంటాయి. అయితే ఆ తర్వాత కోలీవుడ్ మోజులో పడి టాలీవుడ్ ని నెగ్లెట్ చేయడంతో ఇక్కడ మార్కెట్ మొత్తం పడిపోయింది. ఆ తరువాత తమిళ్ లో కూడా సక్సెస్ దక్కలేదు. ఇక లాస్ట్ ఇయర్ మహా సముద్రం లో నెగిటివ్ రోల్ లో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వగా అది ఫెయిల్ అయింది.

అయితే చేతిలో ఉండే అన్ని రకాల అవకాశాలు మిస్ చేసుకున్న సిద్ధార్థ్ ఇప్పుడు ఒక చిన్న సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఆ సినిమా పేరే “చిన్నా”. తమిళ్ లో తెరకెక్కిన ఆ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ కాగా, సిద్ధార్థ్ కూతురులా పెంచుకుంటున్న చిట్టి అనే పాప అనుకోకుండా ఓ రోజు మిస్ అవుతుంది. అది ఎవరైనా కిడ్నాప్ చేసారా? లేక ఇంకేదైనా రీసనా? తెలీదు గాని, ఆ పాపని కాపాడడానికే హీరో బయటికి వస్తాడు.

- Advertisement -

ఇక ట్రైలర్ కట్స్ బాగున్నా, సినిమా తక్కువ ఖర్చుతో తెరకెక్కించారని క్వాలిటీ చూస్తుంటే తెలిసిపోతుంది. అంతే కాక స్టోరీ నేపథ్యం చిన్నదే కాబట్టి, దాన్ని డైరెక్టర్ ఎంత ఇంట్రెస్టింగ్ గా మలచాడన్నదే ఇంపార్టెంట్. ఇక చిన్నా అనే ఈ సినిమా ఎస్.యూ. అరుణ్ కుమార్ డైరెక్ట్ చేయగా, అక్టోబర్ 6న థియేటర్లలోకి వస్తుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు