Naa Sami Ranga Update: సెంటిమెంట్… ఇద్దరు హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయనున్న 64 ఏళ్ల మన్మధుడు

Naa Sami Ranga Update

కింగ్ నాగార్జున తన కెరీర్ లో 99వ సినిమాను కొత్త డైరెక్టర్ విజయ్ బిన్నీతో చేస్తున్నాడు. దీనికి నా సామి రంగ అనే టైటిల్ కూడా పెట్టారు. దీనికి సంబంధించిన ఒక గ్లింప్స్ వీడియోను ఇటీవల నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు. ది ఘోస్ట్ ఫలితం తర్వాత కొంత టైం తీసుకుని జాగ్రత్తగా చేస్తున్న మూవీ ఇది. ఎలాగైన హిట్ కొట్టి, తన కెరీర్ లో మరో హిట్ వేసుకుని, ది ఘోస్ట్‌తో పోయిన పరువు నిలబెట్టుకోవాలని చూస్తున్నాడు.

ఇప్పటికే నా సామి రంగ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయడమే లక్ష్యంగా చిత్ర యూనిట్ అడుగులు వేస్తుంది. అలాగే కాస్ట్ అండ్ క్రూ విషయంలో కూడా నాగార్జున చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు చేస్తున్నట్టు ఇండస్ట్రీలో గుస గుసలు వినిపస్తున్నాయి. ఇదిలా ఉంటే, తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అదేంటంటే… ఈ సినిమాలో నాగార్జున సరసన ఇద్దరు హీరోయిన్స్ ఉండబోతున్నారట. అందులో ఒకరు అశికా రంగనాథ్. ఇటీవల అమిగోస్ అనే చిత్రంతో తెలుగు తెరపై కనిపించింది. కానీ, ఈ సినిమా ఆశించిన మేర సక్సెస్ కాకపోవడంతో అశికా రంగనాథ్ పేరు బయటకు పెద్దగా వినిపించలేదు. తెలుగులో సరైన డెబ్యూ కోసం ఎదురుచూస్తున్న ఈ బ్యూటీ నా సామి రంగ ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు.

- Advertisement -

మరో హీరోయిన్ మిర్న మీనన్. ఈ పేరు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. కానీ, ఇటీవల రజినీకాంత్ నుంచి వచ్చిన జైలర్ సినిమాలో కోడలు పాత్ర చేసింది అంటే గుర్తుపడుతారు. హీరోయిన్ స్థాయి ఉన్న మిర్న మీనన్ కూడా ఒక సక్సెస్ కోసం వెయిట్ చేస్తుంది. అయితే నాగార్జున తన కెరీర్ లో ఇప్పటి వరకు ఇద్దరు హీరోయిన్స్ తో చేసిన సినిమాలు ఫెయిల్ కాలేదు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను నా సామి రంగకు ఫాలో అవుతున్నాడని తెలుస్తుంది. మరి ఈ 64 ఏళ్ల మన్మధుడికి ఇద్దరు హీరోయిన్స్ రొమాన్స్ చేయడం అనే సెంటిమెంట్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

Grab Filmify for the latest web stories on Celebrities, today’s Tollywood news, the latest images of actors & actresses, new movie ratings & reviews, and the latest entertainment news from all Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు