Bollywood Actress Janhvi Kapoor: వెబ్ సైట్స్‌లో జాన్వీ అశ్లీల ఫోటోలు… షాకింగ్ కామెంట్స్

Bollywood Actress Janhvi Kapoor

దివంగత నటి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వి కపూర్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. 2018లో రొమాంటిక్ డ్రామా ధడక్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. శ్రీదేవి కూతురుగా ఫేమ్ ఉన్నప్పటికీ తన గ్రామర్ తోను గుర్తింపు తెచ్చుకుంది. ఇక ధడక్ సినిమా తర్వాత మిలి మూవీతో లేడీ ఓరియంటెడ్ చిత్రంతోను అలరించింది. ఈ ఏడాదిలో వరుణ్ ధావన్ సరసన భవాల్ లో నటించింది.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన నటిస్తుంది జాన్వి కపూర్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వి కపూర్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తన తల్లిదండ్రులకు సినిమా పరిశ్రమలో ప్రముఖులుగా గుర్తింపు ఉండడంతో చిన్ననాటి నుండే ఫోటోలు, వీడియోలు తన జీవితంలో ఓ భాగం అయినట్లు వెల్లడించింది.

అంతేకాకుండా ఈ డిజిటల్ యుగం తనపై తీవ్ర ప్రభావం చూపించాయని వెల్లడించింది. ” నా చిన్నతనం నుంచి నా సమ్మతితో లేక నా అనుమతి లేకుండానే కొందరు వ్యక్తులు నాతోపాటు నా సోదరి ఖుషి కపూర్ ఫోటోలు తీశారు. అవి మేము యుక్త వయసులో ఉన్నప్పుడు తీసిన ఫోటోలు. ఆ ఫోటోలను కొంతమంది మార్ఫింగ్ చేసి అశ్లీల వెబ్ సైట్ లో పెట్టారు. మేము వాటిని చూసి షాక్ అయ్యాం. ప్రస్తుతం డిజిటల్ యుగంలో మార్పింగ్ ఫోటోల బెడద మరింత ఎక్కువగా అయ్యింది. ప్రజలు కూడా సదరు ఫోటోలను నిజమైనవి గానే నమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థితి నిజంగా ఆందోళనకరం” అని చెప్పుకొచ్చింది.

- Advertisement -

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు