Rakul Preet Singh: పెళ్లిపై రకుల్ ఓపెన్ కామెంట్స్.. ఒంటరిగా ఆ బాధ భరించా..!

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ఎన్నో చిత్రాలలో వైవిద్యమైన కథలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ, ఈ మధ్య తెలుగులో తక్కువ సినిమాలు చేయడంతో అభిమానులు ఈమెను రీఎంట్రీ ఇవ్వాలంటూ కోరుతున్నారు. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం బాలీవుడ్ వైపుగా అడుగులు వేసి అక్కడే పలు సినిమాలలో నటిస్తూ హీరోయిన్ గా ఎదగాలని పలు రకాల ప్రయత్నాలు చేసినా, అది పెద్దగా వర్క్ అవుట్ అవ్వడం లేదు. ఇప్పటి వరకు ఆమె చేసిన సినిమాలు చెప్పుకోదగ్గ సక్సెస్ మాత్రం ఒక్కటి కూడా రాలేదు.

ఈ విషయాన్ని గుర్తించిన రకుల్ ప్రీతిసింగ్ ఈ మధ్యనే తమిళ ఇండస్ట్రీపై కూడా ఫోకస్ పెట్టి పలు సినిమాలలో నటించింది. ఇకపోతే ఇదంతా పక్కన పెడితే ఫిబ్రవరిలో రకుల్ ప్రీతిసింగ్ పెళ్లి జరగబోతోంది అంటూ పలు రకాల వార్తలు బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్లో నిర్మాతగా పేరు సంపాదించిన జాకీ భగ్నాని తో కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిన విషయమే. అయితే రకుల్ ప్రీతిసింగ్ ఇప్పటివరకు పెళ్లి గురించి ఎక్కడ స్పందించలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ప్రీతిసింగ్ ఈ విషయం పై స్పందించారు.

“ప్రతి ఒక్కరి జీవితంలో కూడా భాగస్వామ్యం కలిగి ఉండడం చాలా సహజమైన ప్రక్రియ. సినీ ఇండస్ట్రీలో ఉన్న వారిపై ఈ విషయంలో పలు రకాల ఊహాగానాలు సైతం వినిపిస్తూ ఉంటాయి. నేను కూడా ఎన్నో సంవత్సరాలుగా ఒంటరిగా జీవించాను. అలా జీవిస్తున్న నా జీవితంలోకి జాకీ వచ్చారు. అతను వచ్చాక పూర్తిగా నా జీవితం మారిపోయింది. జాకీ కూడా ఇదే పరిశ్రమకి చెందిన వ్యక్తి కావడంతో నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నారంటూ తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాకుండా తామిద్దరము సినిమా ఫిట్నెస్ ని ఇష్టపడతాం” అంటూ తెలిపింది.

- Advertisement -

ఇక ప్రతిరోజు 12 గంటలు షూటింగ్లో బిజీగానే ఉంటామని, గంట మాత్రమే కలిసి సమయాన్ని గడుపుతూ, తమ వ్యక్తిగత విషయాలను మాత్రమే మాట్లాడుకుంటామంటూ తెలియజేశారు. ఎలాంటి విషయాన్ని అయినా తన అభిమానులతో పంచుకుంటానుని, కచ్చితంగా త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతానని తెలిపింది రకుల్ ప్రీతిసింగ్. ఇక తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. పదేళ్ల క్రితం తాను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో సినీ నేపథ్యం లేకపోవడం వల్ల ఎలాంటి కథలు ఎంచుకోవాలో తనకు తెలియదని.. తన తొలి సినిమా ఆరంభంలోనే అదృష్టం వరించి .. సినీ కెరియర్ చాలా సంతృప్తినిచ్చిందంటూ తెలిపింది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు