Personality Development : లైఫ్ లో నిజంగా ఎదగాలని కోరుకుంటే ఈ అలవాట్లను ఇప్పుడే వదిలేయండి

Personality Development : లైఫ్ లో ఎదగాలి అంటే జీవితం పట్ల పాజిటివ్ దృక్పథం, సెల్ఫ్ డెవలప్మెంట్ చాలా ముఖ్యం. అయితే చాలామంది జీవితంలో సరైన లక్ష్యం లేకుండా తిరగడం వల్ల ఎదగలేకపోతారు. ఆ విషయాన్ని వాళ్ళు చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు. ఇక అనుకున్న విధంగా లైఫ్ లో డెవలప్ కాకపోవడానికి కొన్ని అలవాట్లు కూడా కారణం అవుతాయి. మరి ఎలాంటి అలవాట్లను వదులుకుంటే సక్సెస్ ఫుల్ గా లైఫ్ లో ముందుకు వెళ్ళగలుగుతాం ? అంటే…

1. పనులను వాయిదా వేయడం

Personality Development: If you really want to grow in life, leave these habits now
ఏదైనా ఒక పనిని చేయాల్సి వచ్చినప్పుడు దాని గురించి ఎక్కువగా పట్టించుకోకుండా చాలా కష్టమైన పని అనే సాకుతో దాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైనా ఏదైనా పని చేసేటప్పుడు ఇలాంటి ఫీలింగ్ వస్తే వెంటనే ఆ పనిని చిన్న చిన్న భాగాలుగా విభజించి కంప్లీట్ చేయండి. అంతేగాని వాయిదా వేస్తూ పోతే అది ఎప్పటికీ పూర్తి అవ్వదు.

- Advertisement -

2. అతిగా ఆలోచించడం

Personality Development: If you really want to grow in life, leave these habits now
ఏదైనా చేయాలనుకున్నప్పుడు అతిగా ఆలోచించడం వల్ల టైం వేస్ట్ అయ్యి వాయిదా పడడం తప్ప ఒరిగేదేమీ ఉండదు. మరి ఆలోచించకుండా ఎలా పని చేయాలి? అంటే ఆలోచించడం తప్పు కాదు, కానీ దాని గురించే అతిగా ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయడం తప్పు. కాబట్టి చురుకుగా ఆలోచిస్తూ సమయానికి సరైన నిర్ణయం తీసుకోవాలి. ప్రతి విషయానికి లోతుగా విశ్లేషణ అనేది అవసరం లేదు. అందుకే ఊరికే అతిగా ఆలోచించకుండా ప్రస్తుతం మీ చేతిలో ఉన్న క్షణాన్ని ఉపయోగించుకోండి.

3. సాకులు చెప్పడం

Personality Development: If you really want to grow in life, leave these habits now
ఏదైనా తప్పు చేసినప్పుడు అవసరమైతే క్షమాపణలు చెప్పి , అక్కడికక్కడే దాన్ని వదిలేయండి. అంతేగాని సాకులు చెబుతూ మీ తప్పులను ఒప్పుకోకుండా ఆ ఎమోషన్స్ ను తలపై భారంలా మోస్తూ తిరగకండి. ప్రపంచంలో తప్పు చేయని వాళ్లంటూ ఎవరూ ఉండరు. కాబట్టి చేసిన తప్పులను అంగీకరించడం బాధ్యతగా భావించండి. ఆ తప్పు నుంచి కొత్త విషయాలు నేర్చుకోండి. అలా దాన్ని మీ వ్యక్తిగత అభివృద్ధి కోసం ఉపయోగించుకోండి.

4. నెగిటివిటీ

Personality Development: If you really want to grow in life, leave these habits now
అంతులేని ప్రతికూల ఆలోచనల ఉచ్చులో పడడం చాలా సులభం. ఒకవేళ మిమ్మల్ని అలాంటి నెగటివ్ ఆలోచనలు చుట్టుముడితే ముందు చేయాల్సిన అసలు పనులపై శ్రద్ధ పెట్టలేరు. ఇలాంటి నెగిటివ్ ఆలోచనలను పక్కకు పెట్టి మీ జీవితంలోని సానుకూల అంశాలపై దృష్టి పెట్టండి. మీకు నచ్చే పనులను చేస్తూ పాజిటివ్ మైండ్ సెట్ ను బిల్డ్ చేసుకోండి.

5. ఇతరులతో పోల్చుకోవడం

Personality Development: If you really want to grow in life, leave these habits now
ప్రపంచంలో మీకంటే సక్సెస్ ఫుల్, ధనవంతులైన, అందమైన వ్యక్తులు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్లపై ద్వేషం, అసూయ మీలో పెరిగిపోతుంది అంటే తప్పటడుగు వేస్తున్నట్టే. ఈ ప్రపంచంలో మిమ్మల్ని ప్రేరేపించే, మీలో ఉత్సాహాన్ని పెంచే అంశాలు, మీకు స్ఫూర్తినిచ్చే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఇతరులతో మిమ్మల్ని పోల్చుకుని అసూయ పడడం కన్నా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మీ స్టిల్స్ ను డెవలప్ చేసుకోండి. మీకంటే ఇతరులకు ప్రాధాన్యత నివ్వడం, నేర్చుకునే అవకాశాలను లైట్ తీసుకోవడం వంటి అలవాట్లు మీకు ఉంటే వెంటనే వాటిని పక్కన పెట్టేయండి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు