Kiara advani: కియారా భర్త ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా..?

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో అందంతో తెలుగు ప్రేక్షకుల మంత్రముగ్ధులను చేసిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో భరత్ అనే నేను చిత్రంతో అడుగుపెట్టింది. ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత వినయ విధేయ రామ సినిమాలో నటించింది కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. దీంతో తెలుగులో ఫేడ్ అవుట్ అవుతుంది అనుకునే సమయానికి ప్రస్తుతం శంకర్ – రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది.

ఇదిలా ఉండగా అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్లో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్న సిద్దార్థ్ మల్హోత్రా తో ప్రేమలో పడి గత ఏడాది పెళ్లి పీటలెక్కిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఈ జంట ఎప్పటికప్పుడు వార్తల్లోనే నిలుస్తున్నారు. ఇకపోతే బాలీవుడ్లో కియారా అద్వానీ , సిద్దార్థ్ మల్హోత్రా జంటకి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇదిలా ఉండగా వీరికి సంబంధించిన కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కియారా పెళ్లి చేసుకున్న సిద్దార్థ్ మల్హోత్ర ఆస్తులు ఎంత ఉన్నాయి అన్న విషయం హాట్ టాపిక్ గా మారింది.

అసలు విషయంలోకి వెళ్తే ఢిల్లీలో జన్మించిన సిద్దార్థ్ మల్హోత్ర మొదట్లో తన ఖర్చుల కోసం మోడలింగ్ చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత మోడలింగ్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈయన బుల్లితెర సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టాడు. “ధర్తి కా వేర్ యోద్ధ పృథ్విరాజ్ చౌహాన్ ” సీరియల్లో కూడా నటించాడు. ఆ తర్వాత ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి ఆయన దర్శకత్వంలోనే వచ్చిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో బాలీవుడ్లోకి అడుగు పెట్టాడు.

- Advertisement -

ఇక ఈ సినిమా తర్వాత వెనుతిరిగి చూడలేదు. ఆ తర్వాత జవాన్, ఏక్ విలన్, కపూర్ అండ్ సన్స్, అయ్యారి, బార్ బార్ దేకో వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించి మంచి పేరు దక్కించుకున్నారు. అలాగే షేర్షా తర్వాత ఆయన పాపులారిటీ మరింత పెరిగిపోయిందని చెప్పాలి. ఆ సినిమాలో సిద్ధార్థ కి జోడిగా కియారా నటించింది. ఇక రియల్ లైఫ్ లో కూడా వీరిద్దరూ జోడి అయిపోయారు. ఇక సిద్దార్థ్ ఆస్తుల విషయానికి వస్తే… మొత్తం రూ .100 కోట్ల ఉన్నట్లు సమాచారం.

అలాగే ముంబైలో పాలి హిల్ ప్రాంతంలో విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది. నటుడు గానే కాకుండా మోడల్ గా కూడా చేస్తున్నాడు కాబట్టి సంవత్సరానికి 6 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అలాగే లగ్జరీ కార్లు, బైకులు అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే రూ.14 లక్షల విలువైన హార్లే డేవిడ్సన్ అమెరికన్ బైక్ ఈయన సొంతం. రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ ML 350, SUV వంటి లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు