R.Narayanamurthy: బ్రహ్మానందం పిలిచి అవకాశం ఇచ్చినా వద్దన్న నారాయణమూర్తి.. కారణం..!

R.Narayanamurthy: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నవ్వుల రారాజు బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగా ఆయన నేను మీ బ్రహ్మానందం అంటూ తన ఆత్మ కథను రాసుకొని.. పుస్తక రూపంలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇందులో ఎన్నో విషయాలను పంచుకున్నారు.  అందులో భాగంగానే ప్రజా సమస్యలను సినిమాలుగా తెరకెక్కించి పీపుల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆర్.నారాయణ మూర్తి గురించి కూడా ఆ పుస్తకంలో ప్రస్తావించడం ఇప్పుడు వైరల్ గా మారింది. బ్రహ్మానందం అంటే నారాయణమూర్తికి ప్రత్యేకమైన అభిమానం..  కొన్ని రోజుల క్రితమే ఆయన తీసిన యూనివర్సిటీ సినిమా ప్రమోషన్స్ లో కూడా బ్రహ్మానందం పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలోనే ఆర్ నారాయణ మూర్తి.. బ్రహ్మానందం తో తనకు ఉన్న బంధంతోపాటు వీరిద్దరి మధ్య జరిగిన కొన్ని సంఘటనలను పంచుకున్నారు..  బ్రహ్మానందం కి ఒక విషయంలో హాట్సాఫ్ చెప్పాలి. నా లాల్ సలాం సినిమా సెన్సార్ ఇబ్బందులకు గురైనప్పుడు..రీ షూట్ చేసి,  రీ డబ్బింగ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఆర్థికంగా నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. అలాంటి సమయంలో నన్ను బ్రహ్మానందం ప్రసాద్ ల్యాబ్ లో చూసి పక్కకు తీసుకెళ్లి ఇప్పుడు మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి.. నేనే ఇస్తాను.. మీరు ఏమి ఇబ్బంది పడకండి.. మీరు ఈ కష్టం నుంచి బయటపడండి. ఆర్థికంగా నేను సపోర్ట్ చేస్తాను అన్నారు.. ఇక ఆయనపై  నాకు కృతజ్ఞత భావం ఉంది.. ఆయనే వచ్చే సహాయం చేస్తానన్నా నేను డబ్బు తీసుకోలేదు. కానీ నేను సపోర్ట్ చేస్తాను అన్న ఆయన మాటకు హాట్సాఫ్ అంటూ తెలిపారు ఆర్ నారాయణ మూర్తి.
అంతేకాదు ఒకసారి బ్రహ్మానందమే వచ్చి నా సినిమాలో వేషం ఇవ్వమని అడిగారు. ఏ వేషం ఇచ్చినా డబ్బులు.. ఎంత ఇచ్చినా పర్లేదు అన్నారు. అది ఆయన మంచి మనసు.. కానీ నేను అయ్యా.. మీ వంటి పెద్ద స్టార్లు.. బిజీగా ఉండే నటులు.. మీలాంటి బిజీ నటులను నేను పెట్టుకోలేను.. ఏమనుకోకండి.. మీ ప్రేమని మాత్రం నా మీద ఎప్పుడు ఇలాగే ఉంచండి.. మీరు ఎన్నటికీ గొప్ప స్థాయిలోనే ఉండాలని అనుకుంటున్నాను అని తెలిపారు ఆర్.నారాయణమూర్తి. మొత్తానికైతే బ్రహ్మానందం మంచి మనసుని మరొకసారి గుర్తు చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు