Rakul Preet Singh: పీఎం మోదీ ప్లాన్… రకుల్ ప్రీత్ పెళ్లి వేదిక మారింది

Rakul Preet Singh

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగులో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోయిన ఈమె వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది. అలా రామ్ చరణ్ , అల్లు అర్జున్ , మహేష్ బాబు , ఎన్టీఆర్ , నాగర్జున వంటి స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈమె తమిళ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోలతో జతకట్టి మెప్పించింది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే టాలీవుడ్ , బాలీవుడ్ ఇండస్ట్రీలలో చాలామంది వివాహం చేసుకొని ఒక ఇంటి వారు అవుతుండగా.. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా పెళ్లికి సిద్ధం అయింది.

ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీళ్ళ ప్రేమ వ్యవహారం చాలా కాలం సీక్రెట్ గా ఉన్నప్పటికీ మీడియా కంట ఎన్నోసార్లు కలిసి కనిపించారు. దీంతో వార్తలు వైరల్ అవ్వడంతో అధికారికంగా తాము రిలేషన్ లో ఉన్నట్టు ప్రకటించారు. ఇక ఇప్పుడు ఈ జంట పెళ్లికి సిద్ధం అయింది.. అయితే ఫిబ్రవరిలో వీరి వివాహం చాలా గ్రాండ్గా జరగనున్నట్లు సమాచారం. ఇక డెస్టినేషన్ వెడ్డింగ్ ను గోవాలో జరుపుకోబోతున్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు రకుల్ – జాకీ భగ్నానీ ల డెస్టినేషన్ వెడ్డింగ్ గోవాలో జరగడానికి ప్రధానమంత్రి మోదీ కారణమని తెలుస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ జంట ముందుగా విదేశాలలో వివాహం చేసుకోవాలని అనుకున్నారట. అయితే మిడిల్ ఈస్ట్ లో వివాహం చేసుకోవాలని ఇద్దరూ ఫిక్స్ అయ్యారట.. కానీ ప్రధాని మోదీ.. సెలబ్రిటీలు తమ ముఖ్యమైన ఈవెంట్లను ఇండియాలోనే జరుపుకోవాలని సూచించిన విషయం తెలిసిందే.. దీంతో జాకీ – రకుల్ ఇద్దరూ కూడా తమ పెళ్ళిని గోవాకి షిఫ్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇకపోతే లక్షద్వీప్ లో మోదీ చేసిన ఫోటోషూట్ తర్వాత మాల్దీవ్స్ మంత్రులు చేసిన కామెంట్స్ ఇండియన్స్ ని ఉడికించాయి. దాంతో చాలామంది సెలబ్రిటీస్ మాల్దీవ్స్ వెకేషన్స్ ను రద్దు చేసుకున్నారు. ఇప్పుడు రకుల్ – జాకీ కూడా తమ పెళ్లిని గోవాకి షిఫ్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఎక్కడో మిడిల్ ఈస్ట్ లో జరగాల్సిన వీరి వివాహం.. ప్రధానమంత్రి మోదీ కారణంగా ఇక్కడే ఇండియాలో గోవాలో వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇకపోతే ఎక్కడ జరగబోతుందో తెలిసింది కానీ ఎప్పుడు జరగబోతుందో తెలియాల్సి ఉంది. అంతేకాదు వీరి వివాహానికి ముఖ్య అతిథులుగా ఎవరెవరు వస్తారో కూడా తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు