Sikandar Update : సల్మాన్ కు విలన్ గా ఆ పవర్ ఫుల్ తమిళ నటుడు ?

Sikandar Update : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ తన నెక్స్ట్ మూవీకి సిద్ధమవుతున్నారు. ఈసారి ఆయన ప్రముఖ సౌత్ డైరెక్టర్ ఎ.ఆర్. మురుగదాస్‌తో సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ‘సికందర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. సల్మాన్ ఖాన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ‘సికందర్’ సినిమాలో సల్మాన్ కు విలన్ గా ఓ పవర్ ఫుల్ తమిళ నటుడు కన్పించబోతున్నాడని తెలుస్తోంది.

విలన్ గా కట్టప్ప

‘బాహుబలి’ ఫేమ్ సత్యరాజ్ సికందర్ మూవీలో విలన్‌గా నటించనున్నాడని సమాచారం. దీనిపై సోషల్ మీడియాలో పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. సత్యరాజ్ ‘బాహుబలి’ సినిమాలో కట్టప్ప పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. చాలామంది మూవీ లవర్స్ కు ఆయన సొంత పేరు కంటే కట్టప్పగానే తెలుసు. సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా అతనికి కట్టప్ప పాత్ర ద్వారా ఊహించనంత పాపులారిటీ వచ్చింది. కానీ మళ్ళీ పాన్ ఇండియా రేంజ్ లో ఆకట్టుకునే అవకాశాలు మాత్రం రాలేదు. ఇప్పుడు విన్పిస్తున్న వార్తల ప్రకారం సల్మాన్ ఖాన్ సరసన విలన్ గా నటిస్తే అతని ఫాలోయింగ్ మరింతగా పెరుగుతుంది. అయితే ఈ విషయాన్ని చిత్ర బృందం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. మరి ఈ రూమర్ రూమర్ గానే మిగులుతుందా? లేదా నిజంగానే సత్యరాజ్ ఈ మూవీలో భాగం అవుతారా అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Salman Khan to romance Rashmika Mandanna, details inside

- Advertisement -

సల్మాన్ లాంగ్ గ్యాప్

సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ 3’ 2023లో విడుదలైంది. ఆ మూవీ తరువాత ఇప్పటి వరకు సల్మాన్ సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. వరుసగా డిజాస్టర్లు అందుకుంటుండడంతో సల్మాన్ ఏడాది పాటు లాంగ్ బ్రేక్ తీసుకున్నారు. అదే సమయంలో మురుగదాస్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘సికిందర్’ 2025లో విడుదల కానుంది. దాంతో ఈ మూవీ గురించి సల్మాన్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాతో సల్మాన్ కు హిట్ ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నాడు డైరెక్టర్ మురుగదాస్. ‘సికిందర్’ చిత్రానికి సాజిద్ నడియావాలా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సికిందర్ లో సౌత్ డామినేషన్

‘సికిందర్’ సినిమాలో సౌత్ వాళ్లదే డామినేట్ అవుతుంది. ఎ.ఆర్. మురుగదాస్ సౌత్ డైరెక్టర్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం అందుస్తున్న టాక్ ప్రకారం విలన్‌గా నటిస్తున్న సత్యరాజ్‌ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పాపులర్ నటుడే. అలాగే ఈ సినిమా హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక మందన్న కూడా సౌత్ ఇండియన్ టాలెంట్. దానివల్ల ‘సికిందర్’ సినిమా సౌత్ కు ప్రత్యేకం అవుతుంది.

మోడీ బయోపిక్ రూమర్స్..

కొన్ని రోజుల క్రితం సత్యరాజ్ గురించి ఒక గాసిప్ వచ్చింది. నరేంద్ర మోదీ బయోపిక్‌లో సత్యరాజ్ నటిస్తారని చెప్పుకొచ్చారు. అయితే ఆ వార్తల్లో నిజం లేదని సత్యరాజ్ స్వయంగా స్పష్టం చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు